తండ్రి కొడుకుల కోసం సిద్ధమయిన స్టోరీ
- January 17, 2017 / 01:19 PM ISTByFilmy Focus
అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్యతో కలిసి మనం మూవీలో నటించారు. ప్రేమమ్ సినిమాలోనూ నాగ్ కనిపించారు. అయితే అక్కినేని అభిమానులు మాత్రం పవర్ ఫుల్ యాక్షన్ కథలో తండ్రి కొడుకులను చూసుకోవాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. అలాంటి చిత్రాన్ని ఇప్పటివరకు నాగ్, చైతు కలిసి చేయలేదు. తాజాగా అటువంటి కథ దొరికిందని సమాచారం. సంక్రాంతికి రిలీజ్ అయిన కుటుంబ కథా చిత్రం ‘శతమానం భవతి’ మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమాని చాలా చక్కగా తెరకెక్కించిన దర్శకుడు సతీష్ వేగేశ్న కు నాగ్ అవకాశం ఇస్తున్నట్లు ఫిల్మ్ నగర్లో టాక్ మొదలయింది.
సతీష్ నాగార్జున, నాగ చైతన్యలకు మంచి స్టోరీ రెడీ చేశారని, దానిని నిర్మించేందుకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చైతూ మూవీ చేస్తున్నారు. నాగార్జున మాత్రం ఓం నమో వెంకటేశాయ చిత్రాన్ని పూర్తి చేసి కొడుకుల పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ హడావుడి తగ్గిన తర్వాత సతీష్ వేగేశ్నప్రాజక్ట్ పై కింగ్ నాగార్జున దృష్టి పెట్టనున్నట్లు తెలిసింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















