Akkineni Family: అఖిల్ పుట్టినప్పుడు అక్కినేని ఫ్యామిలీలో ఏం జరిగిందో తెలుసా?
- July 29, 2026 / 05:28 PM ISTByFilmy Focus Desk
‘నాకు కూతురే కావాలి..’ – అఖిల్ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాట ఇది. ఈ మాట ఆయన చెప్పడానికి ఏమైనా కారణాలు ఉండొచ్చు. అయితే 32 ఏళ్ల క్రితం నాగార్జున కూడా ఇలానే అనుకున్నారట. అంతేకాదు తనకు కూతురు పుడుతుందని ఫ్రాక్‌లు, ఆడ పిల్లలు ఆడుకునే బొమ్మలు, వాడే వస్తువులు షాపింగ్ చేసి మరీ పెట్టుకున్నారట. ఇలా ఆయన అనుకోవడానికి కారణం కూడా ఉంది. ఇటీవల ఈ మొత్తం విషయాన్ని అఖిల్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
Akkineni Family
ఏమైందంటే.. అఖిల్‌కి జన్మనివ్వడానికి అమల అప్పట్లో అమెరికా వెళ్లారు. ప్రెగ్నంట్‌గా ఉన్నప్పుడు చేసిన స్కాన్స్‌లో ఆడపిల్ల అని నాగార్జునకు అక్కడి వైద్యులు చెప్పారు. దీంతో నాగార్జున ఇక్కడ తనకు ఆడ పిల్ల పుట్టబోతోంది అని అన్ని రకాల వస్తువులు, బట్టలు కొనేసి రెడీ చేశారు. ఎంతగా నమ్మారంటే అమల అండ్ బిడ్డను అమెరికా నుండి రిటర్న్ తీసుకెళ్లడానికి ఫ్లయిట్ టికెట్ తీసేటప్పుడు ఆ బిడ్డ పేరు నిఖిత అని రాసేసి టికెట్ తీసుకున్నారట. కానీ డెలివరీ రోజు చూస్తే మగపిల్లాడు అని తేలింది.
దీంతో ఆ సమయంలో నాగార్జున చాలా డిజప్పాయింట్ అయ్యారట. ఈ విషయాన్ని అమ్మానాన్న తరచూ తనకు చిన్నతనంలో చెప్పేవారని అఖిల్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇదన్నమాట నిఖితగా చాలా ఏళ్లు కడుపులో ఉన్న అఖిల్ కథ. అలా నాగ్ అనుకున్నారనో లేక ఏమో కానీ అఖిల్‌కి ఇప్పుడు ఆడ పిల్లలు అంటే అంత ఇష్టం కలిగింది. ఎట్టి పరిస్థితుల్లో తనకు ఆడపిల్లే పుట్టాలని, తానే లాలించి, ఆడించాలని ఫిక్స్ అయ్యాడు.
అఖిల్ – జైనబ్ పెళ్లి అయ్యి సంవత్సరం అయిపోయింది. మరి త్వరలో ఏమన్నా గుడ్ న్యూస్ చెబుతారేమో చూడాలి. ఇటీవల ‘లెనిన్’ సక్సెస్ మీట్‌లో కపుల్‌ని చూసినప్పుడు ఇలాంటి హింట్స్, సమాచారం అయితే ఏమీ లేదు. సో అయ్యగారు.. నాన్న గారు అవ్వడానికి ఇంకాస్త సమయం పడుతుంది.
















