కొన్ని నెలల క్రితం తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రముఖ నిర్మాత భవ్య ఆనంద్ ప్రసాద్ టి,డి.పి తరపున ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసి దారుణంగా ఓడిపోయిన విషయాన్ని ఇంకా జనాలు మరువక ముందే ఇప్పుడు మరో నిర్మాత రాజకీయ తెరంగేట్రం చేస్తున్నాడు. ఆయన మరెవరో కాదు “బ్రహ్మోత్సవం, వర్ణ” లాంటి ఆల్ టైమ్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్ తోపాటు “క్షణం, ఘాజీ, ఊపిరి” లాంటి సూపర్ హిట్ చిత్రాలను కూడా నిర్మించిన ప్రసాద్ వి.పొట్లూరి. నిజానికి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఈయన వెన్నంటి నిలిచాడు. హైద్రాబాద్ మరియు వైజాగ్ లో నిర్వహించిన రెండు పబ్లిక్ మీటింగ్స్ ను ఆర్గజైన్ చేయడమే కాక కమర్షియల్ హెల్ప్ కూడా అందించాడు.
అలాంటి పివిపి ఇప్పుడు సడన్ గా వై.ఎస్.ఆర్.సి.పిలో జాయినవ్వడం అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేస్తోంది. తాజా సమాచారం మేరకు పి.వి.పి విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నాడు. ఈమేరకు ఆల్రెడీ భారీ మొత్తంలో పార్టీ ఫండ్ ఇవ్వడమే కాక మరో నెలరోజులపాటు చేయనున్న ప్రచారానికి కూడా గట్టిగా ఖర్చు చేయనున్నాడు. మరి పివిపి రాజకీయాల్లో నెలదొక్కుకోగలడో లేదో చూడాలి.