Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Yellamma: మరో వికెట్‌ డౌన్‌.. ‘ఎల్లమ్మ’కి ఏమైంది? ఎందుకీ బ్రేకులు.. ఎందుకీ షాక్‌లు

Yellamma: మరో వికెట్‌ డౌన్‌.. ‘ఎల్లమ్మ’కి ఏమైంది? ఎందుకీ బ్రేకులు.. ఎందుకీ షాక్‌లు

  • November 28, 2025 / 12:15 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Yellamma: మరో వికెట్‌ డౌన్‌.. ‘ఎల్లమ్మ’కి ఏమైంది? ఎందుకీ బ్రేకులు.. ఎందుకీ షాక్‌లు

‘బలగం’ అనే సినిమాతో టాలీవుడ్‌లోకి సర్‌ప్రైజ్‌ బ్లాక్‌బస్టర్‌ ఎంట్రీ ఇచ్చారు దర్శకుడు వేణు యల్దండి. అప్పటికే కమెడియన్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న వేణు.. ఆ సినిమాతో దర్శకుడిగా మారారు. ఆ సినిమాతో వసూళ్లు, అవార్డులు, రివార్డులు కూడా అందుకున్నారు. అయితే తన రెండో సినిమా ఇప్పటివరకు స్టార్ట్‌ అవ్వలేదు. ఆ సినిమా వచ్చి రెండేళ్లు అయినా ఇంకా రెండో సినిమా స్టార్ట్‌ కాకపోవడం కూసింత ఆశ్చర్యమే. అయితే ఆ రెండో సినిమా కోసం జరుగుతున్న ప్రయత్నాలు తెలిసిన వాళ్లు అయ్యో అంటున్నారు.

Yellamma

వేణు రెండో సినిమాగా ‘ఎల్ల‌మ్మ‌’ను నిర్మాత దిల్‌ రాజు చాలా నెలల క్రితమే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ ప్రాజెక్ట్ ఏ ముహూర్తంలో మొద‌లెట్టారో తెలియదు కానీ.. ఒక అడుగు ముందుకి, రెండడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది పరిస్థితి. ఈ సినిమాకు ఇన్నాళ్లూ హీరో కుదరడమే కష్టం అనుకుంటే ఈ మధ్య ఓ ‘కొత్త’ హీరోను తీసుకొచ్చారు. ఆయన దాదాపు ఓకే అని అంటున్నారు. అయితే కుదిరింది అనుకున్న హీరోయిన్‌ ఇప్పుడు నో చెబుతోంది. దీంతో వేణు మరో హీరోయిన్‌ కోసం ప్రయత్నించాల్సిన పరిస్థితి.

keerthy suresh about her look

‘ఎల్లమ్మ’ సినిమా కథను తొలుత నానికి చెప్పారు. ఆయన నుండి రెస్పాన్స్‌ సరిగ్గా లేకపోవడంతో శర్వానంద్‌ దగ్గరకు వెళ్లింది ప్రాజెక్ట్‌. అక్కడా ఉ పడకపోవడంతో నితిన్ కోర్టులోకి వచ్చింది బంతి. ఇప్పుడు నితిన్ కూడా ప‌క్క‌కు వెళ్లిపోవ‌డంతో తిరిగి శర్వానంద్‌ దగ్గరకు వెళ్లింది. అక్కడా సేమ్‌ ఆన్సర్‌ కంటిన్యూ అయింది. చివ‌రికి ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్ర‌సాద్ హీరోగా ఫిక్స‌య్యాడ‌న్న వార్త‌లొచ్చాయి. ఈ విషయంలో క్లారిటీ లేకపోయినా ఆయనే హీరో అంటున్నారు.

మరి, హీరో మారాడనో లేక ఆమెకి ఇష్టం లేదో కానీ అంతా ఓకే అనుకున్న కీర్తి సురేశ్‌ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌ నుండి జంప్‌ అయింది. అయితే ఆమె సినిమాలో ఉన్నట్లు అధికారికంగా చెప్పలేదు కాబట్టి.. ఆమె ఈ సినిమా చేయడం లేదు అని చెప్పింది అనొచ్చు. ‘ఎల్ల‌మ్మ‌’లో మీరు న‌టిస్తున్నారా?’ అని కీర్తిని అడిగితే స్ట్రెయిట్‌గా ఫేస్‌ మీదే ‘నో’ అనేసింది. దీంతో డిసెంబ‌రులో ఈ సినిమా అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌ని భావించిన ప్రేక్షకులు మరోసారి వాయిదాకు ఫిక్స్‌ అయ్యారు.

ఇళయరాజా పాటల పంచాయితీ: అప్పుడెందుకు మాట్లాడలేదు.. కోర్టు ప్రశ్న ఇది!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Yellamma

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

related news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Mahesh – Sandeep: మరొసారి మహేష్‌ – సందీప్‌ కాంబోపై చర్చ.. ఈసారి ఇంకాస్త బలంగా..

Mahesh – Sandeep: మరొసారి మహేష్‌ – సందీప్‌ కాంబోపై చర్చ.. ఈసారి ఇంకాస్త బలంగా..

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

INDRAPUTRA: కిరణ్‌ అబ్బవరం స్థాయిని పెంచుతున్నాడు… తొలి పాన్‌ ఇండియా టైటిల్‌ ఇదే

Kamakshi Bhaskarla: జ్వరంతో ఈవెంట్‌కి వచ్చిన కామాక్షి… స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంటూ…

Kamakshi Bhaskarla: జ్వరంతో ఈవెంట్‌కి వచ్చిన కామాక్షి… స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంటూ…

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

2 hours ago
Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

2 hours ago
Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

3 hours ago
DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

5 hours ago
Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

5 hours ago

latest news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

2 days ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version