Kamal Haasan: కమల్‌ హాసన్‌ ‘బందిపోటు’ సినిమా… రంగంలోకి మూడో హీరో!

  • December 6, 2023 / 11:42 AM IST

సీనియ్‌ స్టార్‌ హీరో సినిమాలో యంగ్‌ హీరోలు నటించడం ఇటీవల ఎక్కువైంది. ఏదో కనిపించాలి అని కాకుండా… ఆ హీరోలకు పాత్రలు కూడా రాస్తున్నారు మన దర్శకరచయితలు. కాస్త పేరున్న కుర్ర హీరోలనే ఆ పాత్రల్లోకి తీసుకొని వావ్‌ అనిపిస్తున్నారు మన సీనియర్‌ స్టార్‌ హీరోలు. ఒక్కోసారి కాస్త పేరున్న స్టార్‌ హీరోలను కూడా తీసుకుంటున్నారు. అలా ‘విక్రమ్‌’లో సూర్య, ‘వాల్తేరు వీరయ్య’లో రవితేజ వచ్చారు. ఇప్పుడు మరోసారి కమల్ అదే పని చేస్తున్నారు.

అయితే ఈసారి ముగ్గురు కుర్ర హీరోలను తీసుకుంటున్నారట. ఇప్పటికే ఇద్దరు యువ హీరోల పేర్లను ప్రకటించగా మూడో హీరో ఇతనే అంటూ సోషల్‌ మీడియాలో మరో పేరు వినిపిస్తోంది. ఆ హీరో ఆ సినిమా దర్శకుడికి బాగా దగ్గర కావడం గమనార్హం. కమల్‌హాసన్‌ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో ‘థగ్‌ లైఫ్‌’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మరో హీరో వస్తున్నాడు.

(Kamal Haasan) కమల్‌ హాసన్‌, మణిరత్నం కాంబినేషన్లో వచ్చిన ‘నాయకన్‌’ సినిమా 80ల కాలంలో కల్ట్‌ క్లాసిక్‌. ఇప్పుడు ఇన్నేళ్లకు అంటే 36 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘థగ్‌ లైఫ్‌’. ఈ సినిమాలో త్రిష కథానాయికగా కనిపించనుండగా.. దుల్కర్‌ సల్మాన్‌, జయం రవి ఇతర ముఖ్య పాత్రధారులు. వీరితోపాటు త‌మిళ యువ హీరో గౌతమ్‌ కార్తీక్ కూడా న‌టించ‌నున్న‌ట్లు సమాచారం. త్వరలో అధికారిక ప్రకటన వస్తుంది అని చెబుతున్నారు.

మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో ‘కడలి’ సినిమాతో గౌతమ్‌ కార్తీక్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు మరోసారి ఆయన డైరక్షన్‌లోనే పెద్ద సినిమా చేయబోతున్నాడు. ఇక ‘థగ్‌ లైఫ్‌’ సినిమా గురించి చూస్తే… గ్యాంగ్‌స్టర్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో కమల్‌ హాసన్‌ రంగరాయ శక్తివేల్‌ నాయకర్‌ అనే పాత్రలో కనిపిస్తాడు. 2024 ఫస్ట్‌ హాఫ్‌ ఆఖరులో సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలుపెడతారట. అప్పుడు ఇంకొన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తాయట.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus