వరుణ్ తేజ్ టార్గెట్ ఈజీనే..!

వరుణ్‌ తేజ్‌ హీరోగా లావణ్యా త్రిపాఠి, అదితీరావు హైదరీ హీరోయిన్లుగా ‘ఘాజీ’ ఫేమ్‌ సంకల్ప్‌ రెడ్డి డైరెక్షన్లో వస్తున్న తాజా చిత్రం ‘అంతరిక్షం’. ‘ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై క్రిష్‌ జాగర్లమూడి సమర్పణలో సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌రెడ్డి నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 21న విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్,పాటలకి మంచి స్పందన దక్కడంతో ఈ చిత్రం పై అంచనాలు పెరిగాయి. జ్ఞాన‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ, ప్ర‌శాంత్ విహారి సంగీతం ఈ చిత్రంలో అద్భుతంగా వచ్చాయని సమాచారం.

‘అంతరిక్షం’ చిత్రానికి డీసెంట్ బిజినెస్ జరిగింది. దాదాపు 21 కోట్ల వరకు బిజినెస్ జరగడం విశేషం. ఇక ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 22 కోట్ల వరకూ వసూళ్ళు రాబట్టాల్సి ఉంది. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే అదేం పెద్ద కష్టం కాదు. పైగా క్రిస్ట్ మస్ నుండీ న్యూ ఇయర్ వరకూ మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం కచ్చితంగా ఉంటుంది. వరుణ్ తేజ్ గత చిత్రం ‘తొలిప్రేమ’ దాదాపు 23 కోట్ల వరకూ వసూళ్ళు సాధించింది.

‘అంతరిక్షం’ ఏరియా వైజ్ ప్రీ -రిలీజ్ బిజినెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం- 6 కోట్లు

వైజాగ్- 2 కోట్లు

ఈస్ట్- 1.30 కోట్లు

వెస్ట్- 1.10 కోట్లు

కృష్ణ- 1.30 కోట్లు

గుంటూరు- 1.60 కోట్లు

నెల్లూరు- 0.70 లక్షలు

సీడెడ్- 2.50 కోట్లు

——————————————–

నైజాం +ఏపీ- 16.5 కోట్లు

—————————————————

కర్ణాటక- 80 లక్షల

రెస్ట్ ఆఫ్ ఇండియా- 0.20 లక్షలు

ఓవర్సీస్- 3.50 కోట్లు

————————————————————

వరల్డ్ వైడ్ బిజినెస్- 21 కోట్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus