The Raja Saab: ప్రభాస్ ‘రాజా సాబ్’.. ఆ లుక్ ఎందుకు లేపేసినట్లు?

ఈసారి ప్రభాస్ రాజా సాబ్ తో సంక్రాంతి సందడి మరో లెవెల్ కి వెళ్ళింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ హారర్ ఫాంటసీ మూవీ గురువారం నుంచే రికార్డుల వేట మొదలుపెట్టింది. మారుతి మార్క్ కామెడీతో వచ్చిన ఈ సినిమాకు ప్రస్తుతం ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమాలో కామెడీ, విజువల్స్ బాగున్నాయని కొందరు చెబుతున్నా.. మెజారిటీ ఫ్యాన్స్ మాత్రం ఒక విషయంలో బాగా డిజప్పాయింట్ అయ్యారు.

The Raja Saab

ప్రమోషన్ల టైమ్ లో చూపించిన ప్రభాస్ డిఫరెంట్ లుక్స్ సినిమాలో పూర్తిగా కనిపించలేదని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా డార్లింగ్ గెటప్స్ లో ఒకటైన ఓల్డ్ మ్యాన్ లుక్ థియేటర్లో ఎక్కడా లేకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఈ ఓల్డ్ మ్యాన్ లుక్ సినిమా కథలో చాలా కీలకం అని అంతా భావించారు.

పోస్టర్లు, టీజర్లలో ఆ గెటప్ చూసి ప్రభాస్ వేరే లెవెల్ లో ఏదో ప్లాన్ చేశారని అనుకున్నారు. కానీ థియేట్రికల్ వెర్షన్ లో అది మిస్ అవ్వడంతో బాసూ ఆ లుక్ ఎక్కడ? అంటూ సోషల్ మీడియాలో మీమ్స్, పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ నిరాశలో ఉన్న ఫ్యాన్స్ కు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.

సినిమాకు సంబంధించి ఒక అదనపు సర్ ప్రైజ్ ప్లాన్ చేసినట్లు ఆయన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. సంక్రాంతి సెలవుల సమయంలో రన్ అవుతున్న సినిమాకు సుమారు ఐదు నిమిషాల ఎక్స్ ట్రా ఫుటేజ్ యాడ్ చేయబోతున్నట్లు ఆయన చెప్పడం విశేషం. దీంతో ఆ ఐదు నిమిషాల్లోనే ఆ మిస్సింగ్ లుక్ ఉంటుందని ఫ్యాన్స్ థియరీలు మొదలుపెట్టారు.

ఆ ఓల్డ్ మ్యాన్ గెటప్ తో వచ్చే సీన్స్ సినిమాకు మరింత బలాన్ని ఇస్తాయని, అందుకే పండగ టైమ్ లో వాటిని యాడ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారని సమాచారం. అయితే ఆ ఫుటేజ్ ను ఎగ్జాక్ట్ గా ఎప్పుడు కలుపుతారో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి రాజా సాబ్ మిక్స్డ్ టాక్ తో ముందుకు వెళ్తున్నా.. సంక్రాంతి సెలవులు కాబట్టి కలెక్షన్ల వర్షం కురవడం పక్కా అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇప్పుడు ఈ ఎక్స్ ట్రా ఫుటేజ్ గానీ యాడ్ అయితే ఆడియన్స్ మళ్ళీ థియేటర్లకు వెళ్ళే అవకాశం ఉంది. మరి ఆ ఓల్డ్ మ్యాన్ లుక్ లో ప్రభాస్ ఏ రేంజ్ లో మేజిక్ చేస్తారో చూడాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus