సమంత గ్లామర్ రోల్స్ ని పక్కన పెట్టి కంటెంట్ ఉన్న కథలు చేయడం ఎప్పుడైతే మొదలుపెట్టిందో అప్పటి నుండి ఆమె స్టార్ డమ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. ‘రంగస్థలం’ లో చేసిన రామలక్ష్మి పాత్ర కానీ, ‘మహానటి’ లో చేసిన జర్నలిస్టు మధురవాణి పాత్ర కానీ.. ‘ఓ బేబీ’ లో చేసిన బేబీ పాత్ర కానీ ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అదే టైంలో ఈమె ‘ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2’ వెబ్ సిరీస్లో చేసింది.
అందులో చేసిన యాక్షన్ సీన్స్, బెడ్ రూమ్ సీన్స్ ఈమె సినీ కెరీర్..నే కాదు ఆమె జీవితాన్నే మార్చేశాయి అని చెప్పాలి. తర్వాత వచ్చిన ‘యశోద’లో కూడా ఆలాంటి పాత్రే చేసింది సమంత. ఆ తర్వాత మళ్ళీ గ్లామర్ యాంగిల్ కి షిఫ్ట్ అయ్యి.. ‘శాకుంతలం’ ‘ఖుషి’ వంటి సినిమాలు చేసింది. అవి ఆడలేదు. దీంతో కొంచెం గ్యాప్ తీసుకుంది. ఇప్పుడు ‘మా ఇంటి బంగారం'(Maa Inti Bangaaram) అనే సినిమా చేస్తుంది. ఆమె స్నేహితురాలు నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది.
తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను టీజర్ ట్రైలర్ పేరుతో వదిలారు. దీనికి క్రియేటెడ్ బై అంటూ సమంత భర్త రాజ్ నిడిమోరు పేరు పడింది. దాని వెనుక కథేంటో మేకర్స్ కే తెలియాలి.ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘మా ఇంటి బంగారం’ టీజర్ ట్రైలర్ నిడివి 1:47 నిమిషాలు ఉంది. కొన్ని ఆచారాలు, కట్టుబాట్లు కలిగిన కుటుంబంలోకి కొత్త కోడలిగా వెళ్లిన ఓ అమ్మాయి.. అది ఎందుకు? అనే ఆసక్తిని రేకెత్తిస్తూ ఈ టీజర్ ట్రైలర్ ను కట్ చేశారు.
ఇందులో సమంత చేసిన యాక్షన్ ఎలిమెంట్స్ హైలెట్ అయ్యాయి. అవి కూడా చాలా వరకు ‘ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2’ లో చేసిన ఫైట్స్ కి దగ్గరగా ఉన్నాయి. సమంత సొంత బ్యానర్ అయిన ‘ట్రలాల మూవింగ్ పిక్చర్స్’ పైనే ఈ సినిమా కూడా రూపొందుతుంది.