నేచురల్ నాని హీరోగా నజ్రియా ఫహాద్ హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంటే సుందరానికీ!’. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 10న తెలుగుతో పాటు మలయాళ, తమిళ భాషల్లో కూడా రిలీజ్ అయిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది కానీ మంచి మొదటి రోజు కలెక్షన్లు ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు.
రెండో రోజు, మూడో రోజు పర్వాలేదు అనిపించింది. మొత్తంగా ఫస్ట్ వీకెండ్ ఓకే అనిపించిన ఈ మూవీ వీక్ డేస్ లో మాత్రం చాలా డౌన్ అయ్యింది.ఒకసారి ‘అంటే సుందరానికీ!’ 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం
5.19 cr
సీడెడ్
1.10 cr
ఉత్తరాంధ్ర
1.28 cr
ఈస్ట్
0.90 cr
వెస్ట్
0.77 cr
గుంటూరు
0.83 cr
కృష్ణా
0.80 cr
నెల్లూరు
0.54 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
11.41 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
1.25 cr
ఓవర్సీస్
4.50 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
17.16 cr
‘అంటే సుందరానికీ!’ చిత్రానికి రూ.30.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు ఈ చిత్రం రూ.31 కోట్ల షేర్ ను రాబట్టాలి. కానీ 6 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం రూ.17.79 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.13.21 కోట్ల షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్నప్పటికీ ఈ మూవీ అంతంత మాత్రం ఓపెనింగ్స్ నే సాధించింది.
వీక్ డేస్ లో ఈ మూవీ పెద్దగా రాణించలేకపోతుంది. ఒక్క ఓవర్సీస్ లో తప్ప మిగిలిన అన్ని చోట్ల ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు.