నేచురల్ నాని హీరోగా నజ్రియా ఫహాద్ హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంటే సుందరానికీ!’. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 10న తెలుగుతో పాటు మలయాళ, తమిళ భాషల్లో కూడా రిలీజ్ అయిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది కానీ ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టలేకపోతుంది.
ఫస్ట్ వీక్ ఈ చిత్రం ఏమాత్రం క్యాష్ చేసుకోలేకపోయిన ఈ చిత్రానికి ఇంకో వీకెండ్ మాత్రమే మిగిలింది అని చెప్పాలి. ఒకసారి ‘అంటే సుందరానికీ!’ 8 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం
5.61 cr
సీడెడ్
1.11 cr
ఉత్తరాంధ్ర
1.30 cr
ఈస్ట్
0.92 cr
వెస్ట్
0.79 cr
గుంటూరు
0.86 cr
కృష్ణా
0.84 cr
నెల్లూరు
0.56 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
11.99 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
1.34 cr
ఓవర్సీస్
5.04 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
18.37 cr
‘అంటే సుందరానికీ!’ చిత్రానికి రూ.30.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు ఈ చిత్రం రూ.31 కోట్ల షేర్ ను రాబట్టాలి. కానీ 8 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం రూ.18.37 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.12.63 కోట్ల షేర్ ను రాబట్టాలి.
మొదటి రోజు పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్నప్పటికీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి పెర్ఫార్మన్స్ ఇవ్వలేకపోతోంది.ఓవర్సీస్ బయ్యర్ మాత్రం సేఫ్ అయ్యారు. అక్కడ డీసెంట్ ప్రాఫిట్స్ ను కూడా అందించింది ఈ చిత్రం.