Anu Emmanuel: అను ఇమ్మాన్యుయేల్ బాలనటిగా ఏన్ని సినిమాలో నటించిందో తెలుసా..!

బాలనటులుగా నటించిన ఎంతో మంది నేడు సూపర్ స్టార్ హీరోలుగా, హీరోయిన్లు గా కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. మహేష్ బాబు , జూనియర్ ఎన్టీఆర్ , తరుణ్ , రాశి, హన్సిక వంటి వారు అలాంటి వాళ్ళే. అయితే వీరితో పాటుగా ప్రముఖ యంగ్ హీరోయిన్ అను ఇమ్మానుయేల్ కూడా బాలనటిగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది అనే విషయం చాలా మందికి తెలియదు. న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘మజ్ను’ చిత్రం ద్వారా తెలుగు ఆడియన్స్ కి పరిచయమైనా అను ఇమ్మానుయేల్,

ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘అజ్ఞాతవాసి’ ,మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ‘నా పేరు సూర్య’ వంటి సినిమాల్లో నటించింది. కెరీర్ ప్రారంభం లోనే ఇంత పెద్ద స్టార్ హీరోలతో నటించే అవకాశం దక్కింది కానీ, ఆ రెండు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. ఆ తర్వాత కుర్ర హీరోలతో కూడా సినిమాలు చేసింది కానీ, అవి కూడా పెద్ద ఫ్లాప్ అయ్యాయి. రీసెంట్ గా విడుదలైన ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రానికి మంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చినా కూడా సరిగా ఆడలేకపోయింది.

అలా కేవలం హీరోయిన్ గా మాత్రమే మనకి పరిచయమైనా అను ఇమ్మానుయేల్ ఇంతకు ముందు బాలనటిగా పలు సినిమాల్లో నటించింది అనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు. ఈమె మలయాళం లో టాప్ మోస్ట్ నిర్మాతలలో ఒకరైన తాంకాచన్ ఇమ్మానుయేల్ కి ఒక్కగానొక్క కూతురు. ఈమె పుట్టి పెరిగింది మొత్తం డల్లాస్ లోని టెక్సాస్ ప్రాంతంలోనే. ఇండియా కి వచ్చిన తర్వాత తన తండ్రి నిర్మాణం లో తెరకెక్కిన ‘స్వప్న సంచారి’ అనే చిత్రం లో బాలనటిగా నటించింది. ఈ చిత్రం లో ఆమె నటన చూస్తే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే,

ఆ తర్వాత పలు మలయాళం సినిమాల్లో బాలనటిగా నటించిన (Anu Emmanuel) అను ఇమ్మానుయేల్, 2016 వ సంవత్సరం యాక్షన్ హీరో బిజూ అనే చిత్రం లో హీరోయిన్ గా వెండితెర కి పరిచయమైంది. ఆ తర్వాత అదే సంవత్సరం లో తెలుగు న్యాచురల్ స్టార్ నాని నటించిన ‘మజ్ను’ సినిమా తో తెలుగు ఆడియన్స్ కి కూడా పరిచయమైంది. అలా సాగిన అను సినీ ప్రస్థానం, ఇప్పుడు తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్థిరపడింది. ప్రస్తుతం ఈమె కార్తీ తో జపాన్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus