నాని హీరోగా వచ్చిన ‘మజ్ను’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మలయాళీ ముద్దుగుమ్మ అను ఇమాన్యుల్. మొదటి చిత్రంతోనే హిట్ అందుకోవడంతో తరువాత ఈమెకు పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, నాగ చైతన్య, గోపీచంద్, నాని, విజయ్ దేవరకొండ, విశాల్ వంటి హీరోలతో ఈమె పనిచేసింది. అయితే ఆ చిత్రాలు మంచి ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఈమెకు సహజంగానే అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. అయినప్పటికీ ఈమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది.
ఈ మధ్యన ఈమె కొంచెం సన్నబడి తన లుక్ ను మార్చుకుంది. ప్రస్తుతం అను ఇమాన్యుల్.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ‘అల్లుడు అదుర్స్’ అనే చిత్రంలో నటిస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు మరో క్రేజీ సినిమాలో అవకాశం దక్కించుకుందని తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. శర్వానంద్ హీరోగా ‘ఆర్.ఎక్స్.100’ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ‘మహా సముద్రం’ చిత్రంలో అను ఇమాన్యుల్ ఓ హీరోయిన్ గా ఎంపికయ్యిందట.
ఇప్పటికే ఈ చిత్రంలో అదితి రావు హైదరి హీరోయిన్ గా ఎంపికయ్యింది. ఇప్పుడు మరో హీరోయిన్ గా అను ఇమాన్యుల్ ను ఎంపికైన్నట్టు తెలుస్తుంది. అజయ్ భూపతి మొదటి చిత్రం ‘ఆర్.ఎక్స్.100’ తో పాయల్ టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఒకవేళ అనుకి కూడా ‘మహా సముద్రం’లో మంచి పాత్ర దొరికితే ఈమెకు పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు.