ఫౌజీ కోసం లెజెండరీ యాక్టర్ అనుపమ్ ఖేర్!.. ప్రభాస్ ఆర్మీ లుక్ ఇదే!

Ad not loaded.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)  సీతారామం (Sita Ramam) డైరెక్టర్ హను రాఘవపూడి (Hanu Raghavapudi) కాంబినేషన్‌లో ఫౌజీ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. టైటిల్ విషయంలో అఫీషియల్ అప్డేట్ రావాల్సి ఉన్నా కూడా దాదాపు ఇదే ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారు. పీరియడ్ యాక్షన్ డ్రామాగా 1940ల ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ పాన్ ఇండియా రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ప్రభాస్ ఈ సినిమాలో బ్రిటిష్ ఆర్మీ సైనికుడిగా కనిపించనున్నట్లు సమాచారం.

Fauji

సినిమాలో గ్రాండ్ విజువల్స్, వాస్తవిక యుద్ధ సన్నివేశాలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ప్రత్యేకమైన సెట్లు వేయడం, అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించడం జరుగుతోంది. ఇక తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ఈ సినిమాలో కీలక పాత్రలో జాయిన్ అయ్యారు. అనుపమ్ ఖేర్ (Anupam Kher) , ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి, సినిమాటోగ్రాఫర్ సుదీప్ చాటర్జీ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అనుపమ్ ఖేర్ ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేయడంపై సంతోషం వ్యక్తం చేస్తూ, ఇది తన 544వ సినిమా అని ప్రకటించారు. అనుపమ్ ఖేర్ సోషల్ మీడియా ద్వారా ఈ ప్రాజెక్ట్‌పై ఎగ్జైటింగ్ అనౌన్స్‌మెంట్ చేశారు. ప్రభాస్ వంటి స్టార్‌తో కలిసి పనిచేయడం గర్వంగా ఉంది. హను రాఘవపూడి దర్శకత్వంలో ఇది అద్భుతమైన కథగా వస్తోంది అని ట్వీట్ చేశారు. అనుపమ్ పంచుకున్న ఫోటోల్లో ప్రభాస్ క్యాజువల్ లుక్‌లో కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. ఇక ప్రభాస్ ఆర్మీ లుక్ ఇదే అని ఒక క్లారిటీ వచ్చేసింది.

ఈ ఫోటోలు ట్రెండింగ్‌లోకి వచ్చి సినిమాపై మరింత క్రేజ్ తీసుకొచ్చాయి. ఫౌజీ ( Fauji ) పాన్ ఇండియా లెవల్లో సాలిడ్ హైప్ క్రియేట్ చేసింది. ప్రభాస్ గ్లోబల్ స్టార్ కావడం, హను రాఘవపూడి ఎమోషనల్ టచ్, అనుపమ్ ఖేర్ లాంటి లెజెండరీ నటుడి ఎంట్రీతో అన్ని భాషల్లోనూ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మేకర్స్ ఈ సినిమాను 2026 సమ్మర్‌లో గ్రాండ్ గా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ప్రభాస్ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందనే భావనతో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus