Anupama: అనుపమకు కొత్త ఆఫర్లు రావడం సులువు కాదా?

సాధారణంగా సక్సెస్ ట్రాక్ లో ఉన్న హీరోయిన్లకు సులువుగా కొత్త సినిమా ఆఫర్లు రావడం సాధ్యమవుతుంది. అయితే అనుపమ పరమేశ్వరన్ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. మలయాళ ప్రేమమ్ తో కెరీర్ ను మొదలుపెట్టిన అనుపమ అ ఆ సినిమాతో టాలీవుడ్ లో ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన అనుపమకు ఈ మూవీతో సక్సెస్ దక్కింది.

అయితే సెకండ్ హీరోయిన్ గా నటించడం వల్ల స్టార్ హీరోలు ఈ హీరోయిన్ పై పెద్దగా దృష్టి పెట్టలేదు. తెలుగు ప్రేమమ్ లో సుమ అనే పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించిన అనుపమ శతమానం భవతి సినిమాలోని నిత్య రోల్ తో మరో సక్సెస్ ను అందుకున్నారు. పక్కింటి అమ్మాయిలా కనిపించే అనుపమకు సోషల్ మీడియాలో కూడా భారీ రేంజ్ లోనే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే.

రామ్ కు జోడీగా ఈ బ్యూటీ రెండు సినిమాల్లో నటించగా ఆ సినిమాలు యావరేజ్ రిజల్ట్ ను అందుకున్నాయి. కార్తికేయ2, 18 పేజెస్ సినిమాలతో విజయాలను అందుకున్న అనుపమకు ఈ సినిమాల వల్ల కెరీర్ పరంగా పెద్దగా బెనిఫిట్ అయితే చేకూరలేదు. ప్రస్తుతం అనుపమకు ఇతర భాషల్లో ఆఫర్లు వస్తున్నా తెలుగులో మాత్రం సినిమా ఆఫర్లు ఎక్కువగా రావడం లేదనే సంగతి తెలిసిందే.

అనుపమ తెలుగులో మళ్లీ వరుస ఆఫర్లతో బిజీ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అనుపమ రెమ్యునరేషన్ కూడా తక్కువే అయినా ఆమెకు ఛాన్స్ ఇవ్వడానికి దర్శకనిర్మాతలు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. సినిమా సినిమాకు అనుపమ రేంజ్ పెరుగుతుండగా స్టార్ హీరోలు ఛాన్స్ ఇస్తే మాత్రం అనుపమ మరిన్ని సినిమాలతో బిజీ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus