అనుపమ పరమేశ్వరన్ ‘ప్రేమమ్’ అనే మలయాళ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో అయితే ‘అఆ’ ‘శతమానం భవతి’ ‘హలో గురు ప్రేమిస్తారా’ ‘రాక్షసుడు’ వంటి హిట్ సినిమాల్లో నటించింది. ఆమె మెయిన్ రోల్లో ‘పరదా’ అనే సినిమా రూపొందింది. ఆగస్టు 22న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో అనుపమ చేసిన కామెంట్స్ కొన్ని ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.
అనుపమ మాట్లాడుతూ… “పోస్టర్ పై లేడీ ఉంటే ఆ సినిమాకి చాలా దూరంగా ఉండాలని భావిస్తారు కొందరు జనాలు. అమ్మాయి పోస్టర్ పై ఉంటే ఎవరికీ సినిమాపై ఆసక్తి కలగదు. డిస్ట్రిబ్యూటర్స్ అయినా ఓటీటీ సంస్థలైనా వీటిని కొనుగోలు చేయాలని అస్సలు ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకంటే ఆడియన్స్ లో బజ్ లేదు అని సింపుల్ గా అనేస్తారు. అది కూడా నిజమే.
‘పరదా’ లేడీ ఓరియెంటెడ్ సినిమా. చిన్న సినిమా. కానీ గట్టి నమ్మకంతో చెబుతున్నా కంటెంట్ చాలా పెద్దది. కాబట్టి అందరూ థియేటర్లో చూడాలని ఆకాంక్షిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. అనుపమ చెప్పింది చాలా వరకు నిజమే.లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అంటే ఆడియన్స్ ఆసక్తి చూపించరు. అనుపమ బాగానే అనలైజ్ చేసింది. కానీ విషయం ఉన్న సినిమాలను కచ్చితంగా ఆదరిస్తారు.
వాటి మార్కెట్ కు తగ్గట్టు క్యాష్ చేసుకునే అవకాశం ఉంటుంది. థియేటర్లలో మంచి టాక్ వచ్చి.. జనాలు పెద్దగా చూడని సినిమాలను ఓటీటీ సంస్థలు మంచి రేట్లు ఇచ్చి తీసుకుంటాయి. పైగా సురేష్ బాబు బ్రాండ్ తో ‘పరదా’ రిలీజ్ కాబోతుంది. ఆయనే ఏదో ఒక రకంగా ఓటీటీకి పుష్ చేసే అవకాశం ఉంది.