Murugadoss: శివకార్తికేయన్ అయినా మురుగదాస్ ని గట్టెక్కిస్తాడా?

తమిళ సీనియర్ స్టార్ దర్శకుల కెరీర్ ఆల్మోస్ట్ క్లైమాక్స్ కి వచ్చేసింది. దీంతో వాళ్ళు తెలివిగా టాలీవుడ్ స్టార్ హీరోలను, ప్రొడ్యూసర్లను ఒప్పించి సినిమాలు సెట్ చేసుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో ‘స్పైడర్’ ‘ది వారియర్’ ‘కస్టడీ’ ‘గేమ్ ఛేంజర్’ వంటి ఎన్నో కళాఖండాలు మనకు అందించారు. ఆ షాక్..ల దెబ్బకు తమిళ దర్శకులతో సినిమాలు చేయాలంటే.. తెలుగు హీరోలు, నిర్మాతలు భయపడే పరిస్థితి ఏర్పడింది.

Murugadoss

ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. దర్శకుడు మురుగదాస్ పై తెలుగు ప్రేక్షకులకు కూడా ఓ గౌరవం ఉంది. గతంలో ఆయన తమిళంలో తీసిన ‘రమణ’ సినిమాని తెలుగులో ‘ఠాగూర్’ గా రీమేక్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. అలాగే ‘కత్తి’ ని కూడా తన రీ ఎంట్రీ కోసం వాడుకున్నారు. అలా వచ్చిన ‘ఖైదీ నెంబర్ 150’ మంచి విజయాన్నే అందుకుంది.

అయితే కత్తి తర్వాత మురుగదాస్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది అనే చెప్పాలి. తర్వాత ఆయన తీసిన ‘దర్బార్’ ‘సికందర్’ ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు ఫ్లాప్ అయ్యాయి. అయితే విజయ్ తో చేసిన ‘సర్కార్’ కమర్షియల్ గా కొంత సేఫ్ అయ్యింది. కానీ కంటెంట్ పరంగా అది కూడా డిజప్పాయింట్ చేసింది అనే చెప్పాలి. ఇలాంటి టైంలో మురుగదాస్ చేతిలో ఉన్న ఒకే ఒక్క గోల్డెన్ ఛాన్స్ ‘మదరాసి’.

శివ కార్తికేయన్ తో మురుగదాస్ చేసిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. మురుగదాస్ ఫామ్లో లేనప్పటికీ శివ కార్తికేయన్ ను బట్టి.. ఈ సినిమాపై కొద్దిపాటి అంచనాలు ఉన్నాయి. రూ.200 కోట్ల బడ్జెట్ తో తీశారు. శివ కార్తికేయన్ మార్కెట్ ఎంత ఉందో అంతా పెట్టేశారు. సినిమా కథ, కథనాలు బాగుంటే మురుగదాస్ మళ్ళీ ఫామ్లోకి వస్తారు. లేదు అంటే ఆయన కెరీర్ ఆల్మోస్ట్ ముగుస్తుంది.

కెరీర్లో గ్యాప్, పవన్ కళ్యాణ్ గురించి హీరోయిన్ నిధి అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus