అందుకే ‘రంగ‌స్థ‌లం’ చేయలేక‌పోయాను : అనుపమ

రాంచరణ్ నట విశ్వరూపాన్ని చూపించిన చిత్రం ‘రంగస్థలం’. నాన్ బాహుబలి రికార్డు గా నిలిచింది ఈ చిత్రం. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం 127 కోట్ల షేర్ ను రాబట్టి రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలో నటించిన ప్రతీ ఒక్క ఆర్టిస్ట్ కు మంచి పేరొచ్చింది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా సమంత నటించిన సంగతి తెలిసిందే. ప‌ల్లెటూరి యువ‌తి రామలక్ష్మి గా స‌మంత అద్భుతంగా న‌టించి ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంది. అయితే మొదట ఈ చిత్రంలో హీరోయిన్ గా అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ను అనుకున్నారట. కొన్ని కారణాల వలన ఆమె తప్పుకోవడంతో.. స‌మంత‌ను తీసుకున్నారని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో ఎందుకు నటించలేదు అనే ప్రశ్నకు… తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సమంత పేర్కొంది. అనుపమ మాట్లాడుతూ… ‘రాంచరణ్ ‘రంగ‌స్థ‌లం’ మిస్సయినందుకు చాలా బాధ‌గా ఉంటుంది. అది చాలా మంచి సినిమా. ఆ సినిమాలో హీరోయిన్‌గా న‌టించే అవ‌కాశం నాకే వ‌చ్చింది. డేట్లు కుద‌ర‌క‌పోవ‌డం వ‌ల్ల చేయ‌లేక‌పోయాను. అయితే సినిమా చూసిన త‌ర్వాత మాత్రం నేను చేయ‌డం కంటే స‌మంత చేయ‌డ‌మే మంచిద‌నిపించింది. రామ‌ల‌క్ష్మి పాత్ర‌లో స‌మంత అద్భుతంగా నటించారు’ అంటూ అనుప‌మ చెప్పుకొచ్చింది. సమంత, అనుపమ ‘అఆ’ అనే చిత్రంలో కలిసి నటించిన సంగతి తెలిసిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus