ప్రొఫైల్ పిక్ మార్చిన దర్శకుడు.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు!

దర్శకుడు అనురాగ్ కశ్యప్ తన సోషల్ మీడియా అకౌంట్ లో ప్రొఫైల్ ఫోటో మార్చడంతో నెటిజన్లు అతడిని ట్రోల్ చేస్తున్నారు. అంతగా ట్రోల్ చేయడానికి ఆ ఫోటోలో ఏముందని అనుకుంటున్నారా..? మాస్క్‌లు ధరించిన ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిషాల ఫోటోని ప్రొఫైల్ పిక్ గా పెట్టుకున్నారు. ఢిల్లీలో జేఎన్‌యూ క్యాంపస్‌లో ఆదివారం జరిగిన దుండగుల దాడిని వ్యక్తిరేకిస్తూ.. మోదీ ప్రభుత్వాన్ని ఖండిస్తూ అనురాగ్ ఈ ఫోటోని పెట్టారు. ముసుగులు ధరించిన కొందరు దుండగులు ఆదివారం నాడు జేఎన్‌యూ క్యాంపస్ లోకి చొరబడి స్టూడెంట్స్, లెక్చరర్స్ పై దాడికి దిగిన విషయం తెలిసిందే.

అయితే అధికార బీజేపీ ఇలా ముసుగులు ధరించి ఎవరికీ తెలియకుండా ప్రజలపై దాడికి పాల్పడుతోందనే ఉద్దేశంతో అనురాగ్ ఇలా చేసినట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. నిన్న ముంబైలో గేట్‌వే ఆఫ్‌ ఇండియా వద్ద ఆందోళనలు చేపట్టారు. అనురాగ్ కశ్యప్ కూడా ఇందులో పాల్గొన్నారు. అనురాగ్ పెట్టిన ఫోటోకి వేల మంది లైకులు కొట్టడంతో పాటు కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంలో కొందరు అనురాగ్ ని ట్రోల్ చేస్తున్నారు.

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus