నిర్మాతలను ఒత్తిడి చేస్తున్న అనుష్క, నయనతార
- November 25, 2016 / 12:46 PM ISTByFilmy Focus
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దు ప్రకటనతో చిత్రపరిశ్రమలోని కొంతమంది స్టార్స్ అయోమయంలో పడ్డారు. అధికంగా రెమ్యునరేషన్ తీసుకునే వారు ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది. ఇంతకుముందు వరకు వారు సగం వైట్ మనీ, సగం బ్లాక్ మనీ తీసుకుంటూ ఇళ్లల్లో నింపుకున్నారు. ఇప్పుడది చెల్లకపోవడంతో చిక్కుల్లో పడ్డారు. టాలీవుడ్, కోలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుని సినిమాకు రెండు కోట్లు తీసుకునే నయనతార, అనుష్కలు చాలా టెన్షన్ పడుతున్నారంట. రెండేళ్లుగా వారు బాగా సంపాదించారు.
ఆస్తులేమీ కొనకుండా డబ్బంతా ఇంట్లోనే భద్ర పరుచుకున్నారు. ఈ సంవత్సరం కూడా కొన్ని సినిమాలను ఒప్పుకోవడంతో అనేక కోట్లు బ్యాంక్ ల దాకా వెళ్లలేదు. దీంతో వారిద్దరూ తమ బ్లాక్ మనీని వైట్ చేయమని డబ్బులు ఇచ్చిన నిర్మాతలపై ఒత్తిడి తెస్తున్నట్లు కోడంబాక్కంలో సినీ ప్రముఖులు చెప్పుకుంటున్నారు. తమ డబ్బులనే ఎలా మార్చుకోవాలో తెలియ తికమకపడుతున్న నిర్మాతలకు ఇదొక సమస్యగా మారిందని సమాచారం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.












