అనుష్కను సంప్రదించిన మహానటి టీమ్
- April 19, 2017 / 01:38 PM ISTByFilmy Focus
‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో విమర్శకుల ప్రసంశలందుకున్న డైరక్టర్ నాగ్ అశ్విన్ అభినేత్రి సావిత్రి జీవితంపై సినిమాని తెరకెక్కిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ తో కలిసి స్వప్న దత్ నిర్మిస్తున్న ఈ మూవీకి మహానటిగా టైటిల్ ఖరారు చేస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రీ లుక్ రిలీజ్ చేశారు. సావిత్రితో పాటు సమంత, కీర్తి సురేష్ ల మొహాలతో ఉన్న ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో మహానటిగా కీర్తి సురేష్ నటించనుంది. క్యూట్ బ్యూటీ సమంత జర్నలిస్ట్ గా కనిపించనుంది. ఇక అలనాడు సావిత్రి కి గట్టి పోటీనిచ్చిన జమున పాత్రను అనుష్కతో వేయించాలని చిత్ర బృందం ప్రయత్నిస్తోంది.
రీసెంట్ గా స్వీటీ ని కలిసిన నాగ్ అశ్విన్ మహానటి కథను వినిపించినట్లు తెలిసింది. ఆ పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? లేదా? అనే విషయంలో ఇంకా క్లారీటీ రాలేదు. ప్రస్తుతం అనుష్క లేడీ ఓరియెంటెడ్ ఫిలిం భాగమతి సినిమాలో నటిస్తోంది. ఇంకా ఇతర ఏ ప్రాజక్ట్ కి సైన్ చేయలేదు. బహుశా భాగమతి తర్వాత మహానటిలో నటిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.













