Anushka Sharma: మరోసారి తల్లి కాబోతున్న అనుష్క.. వీడియో వైరల్!

బాలీవుడ్ నటి అనుష్క శెట్టి తల్లి కాబోతున్నారా అంటే అవుననే తెలుస్తుంది. ఈమె క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక ఈ దంపతులకు ఇదివరకే ఒక కుమార్తె కూడా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఒక కుమార్తె ఉన్నటువంటి ఈ దంపతులు మరొక బేబీని ప్లాన్ చేశారని తెలుస్తుంది ఈ క్రమంలోనే అనుష్క కూడా ప్రస్తుతం తల్లి కాబోతున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు వైరల్ అయ్యాయి

ఈ విధంగా అనుష్క విరాట్ కోహ్లీ గత కొద్దిరోజుల క్రితం ముంబైలోని గైనకాలజిస్ట్ దగ్గరకు వెళ్ళగా అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో పెద్ద ఎత్తున ఈమె ప్రెగ్నెన్సీ గురించి వార్తలు వచ్చాయి. అయితే ఇలా ఎప్పటికప్పుడు అనుష్క శర్మ ప్రెగ్నెన్సీ గురించి వార్తలు వస్తున్నా ఈమె మాత్రం ఇప్పటివరకు ఈ వార్తలపై స్పందించి ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ద్వారా ఈ రెండో బేబీకి తల్లి కాబోతున్నారు అంటూ క్లారిటీ వచ్చేస్తుంది.

ప్రస్తుతం ఇండియాలో 2023 వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ అనుష్క శర్మను తీసుకొని ఒక హోటల్ కి వెళ్తున్నటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా అనుష్క శర్మ చేతిని పట్టుకొని వీరిద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఈ వీడియోలో అనుష్క శర్మ బేబీ బంప్ చాలా క్లియర్ గా కనబడుతుంది.

ఇలా ఈమె (Anushka Sharma) తన బేబీ బంప్ పై చేతిని వేసుకుని నడుస్తూ వెళ్లారు. ఇక ఈ వీడియోలో అనుష్క శర్మ బేబీ బంప్ చాలా క్లియర్ గా కనిపించడంతో అందరూ కూడా ఈమె రెండో బేబీకి తల్లి కాబోతోందని భావిస్తూ ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియో పై ఎంతోమంది నేటిజన్స్ కామెంట్స్ చేస్తూ మరోసారి తమ అభిమాన క్రికెటర్ నటి తల్లిదండ్రులు కాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ వీడియోని మరింత వైరల్ చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus