Anushka: బక్కచిక్కిన అనుష్క.. లేటెస్ట్ ఫోటో వైరల్..!

సౌత్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా సత్తా చాటిన అనుష్క శెట్టి ఈ మధ్య ఎక్కువ సినిమాల్లో నటించడం లేదు. బాగా క్యాష్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ కమర్షియల్ సినిమాల్లో నటించడం లేదు. అనుష్క నటించిన చివరి మూవీ ‘నిశ్శబ్దం’. ఇది ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి ఫలితాన్ని అందుకుంది. కానీ సినిమా చూసిన వారంతా బాగోలేదు అంటూ పెదవి విరిచారు. ఆ తర్వాత ఈమె మరో సినిమాలో నటించలేదు. నవీన్ పోలిశెట్టి తో యూవీ క్రియేషన్స్ వారు నిర్మించే సినిమాలో అనుష్క ఫిమేల్ లీడ్ గా కనిపించబోతున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది.

ఆ తర్వాత ఆ ప్రాజెక్టుకి సంబంధించిన ఎటువంటి అప్డేట్ రాలేదు. కనీసం సినిమా టైటిల్ కూడా అనౌన్స్ చేయలేదు. యూవీ క్రియేషన్స్ సంస్థ గురించి అందరికీ తెలిసిన సంగతే కాబట్టి.. జనాలు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఈరోజు అనుష్క పుట్టినరోజు కావడంతో ఈ చిత్రంలో ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను అలాగే ఆమె పాత్ర పేరుని రివీల్ చేశారు.ఈ చిత్రంలో అన్విత రవళి శెట్టి అనే చెఫ్ గా అనుష్క కనిపించబోతుంది. ఈ పోస్టర్ లో అనుష్క చెఫ్ గెటప్ లో కిచెన్ లో ఉండి వంట వండుతున్నట్టు స్పష్టమవుతుంది.

అంతేకాకుండా ఈ పోస్టర్ లో అనుష్క చాలా సన్నగా కనిపిస్తుంది. ‘నిశ్శబ్దం’ మూవీ తర్వాత అనుష్క మళ్ళీ లావైంది. అయితే కేరళ వెళ్లి సహజ సిద్దమైన పద్ధతి ద్వారా చికిత్స తీసుకుని సన్నబడింది. ఇక ఈ మూవీకి నిరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తుండగా రధన్ మ్యూజిక్ ఇస్తున్నారు. రాజీవన్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవరిస్తున్నారు.పి.మహేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2023 లో రిలీజ్ కాబోతుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus