Anushka Shetty: నా అతి పెద్ద వీక్ నేస్ అదే: అనుష్క.!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటి అనుష్క శెట్టి గురించి పరిచయం అవసరం లేదు బాహుబలి తర్వాత ఈమె పెద్దగా సినిమాలలో నటించలేదని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఈమె నవీన్ పోలిశెట్టితో కలిసి సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నటువంటి అనుష్క తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన ఫస్ట్ లవ్ ప్రపోజల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా అనుష్క (Anushka Shetty) మాట్లాడుతూ తాను ఆరో తరగతి చదివే సమయంలోనే తనకు లవ్ ప్రపోజల్ వచ్చిందని తెలిపారు. తన క్లాస్మేట్ ఒక అబ్బాయి తన వద్దకు వచ్చి ఐ లవ్ యు చెప్పడంతో అసలు ఐ లవ్ యు అంటే ఏమో కూడా తెలియకుండా తాను ఓకే అని చెప్పానని అనుష్క ఈ సందర్భంగా తెలియజేశారు. అయితే అదొక మెమొరీగా నాకు గుర్తుండి పోయిందని ఈమె తెలిపారు.ఈ విధంగా అనుష్క తన ఫస్ట్ లవ్ ప్రపోజల్ గురించి తెలియజేస్తూ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక తనకు సినిమా ఇండస్ట్రీలో త్రిష నయనతార భూమిక అంటే ఎంతో ఇష్టమని నటిగా మాత్రమే కాకుండా వారి వ్యక్తిత్వం కూడా బాగా నచ్చుతుందని ఈమె తెలియజేశారు.అలాగే హీరోల గురించి మాట్లాడుతూ నాగార్జున గారితో నటించడం చాలా ఇష్టమని ఆయనతో సినిమా చేయడం చాలా కంఫర్ట్ గా ఉంటుందని అనుష్క తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా తన వీక్ నెస్ గురించి మాట్లాడుతూ తనకు ఫోన్ క్యారీ చేయడం రాదని తెలిపారు.

అదే తన వీక్ నెస్ అంటూ ఈ సందర్భంగా అనుష్క చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సూపర్ సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి అనుష్క ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సక్సెస్ సాధించారు. ప్రస్తుతం ఈమె మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి అనే సినిమాలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus