సాహోలో ఆ సాంగ్ కొరకు మొదట అనుష్కను అనుకున్నారట..!

ప్రభాస్ పాన్ ఇండియా మూవీ సాహో పై జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. దేశవ్యాప్తంగా ఈ మూవీపై మహా క్రేజ్ ఏర్పడింది. ఐతే విడుదల తరువాత సాహో మిశ్రమ ఫలితాలను అందుకుంది. కాగా ఈ చిత్రంలో అనుష్క నటించాల్సి ఉందట. సాహోలో ఓ ప్రత్యేక సాంగ్ కొరకు సాహో దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదించారట. ఆ పాట కోసం ఓ వారం రోజులు డేట్స్ కేటాయించాల్సి రావడంతో అప్పటికే ఆమె నటిస్తున్న నిశ్శబ్దం మూవీ షూటింగ్ డిస్టర్బ్ అయ్యే పరిస్థితి తలెత్తిందట. అనుష్క ఆ సమయంలో సాహో కొరకు డేట్స్ కేటాయించే పరిస్థితిలో ఇక్కడ అనేక మంది ఇతర నటుల షెడ్యూల్స్ డిస్టర్బ్ అయ్యేలా ఉందట. దానితో అనుష్క సాహోలోని ప్రత్యేక గీతంలో నటించడం కుదరలేదు.

ఇక ఈ పాటలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్విలి ఫెర్నాండేజ్ ని తీసుకోగా ఆమె ఈ పాట కోసం భారీగా తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అలా సాహో సినిమాలో అనుష్క చేసే అవకాశం మిస్సయింది. ఒక వేళ అనుష్క ఆ పాటలో నటించనట్లైతే సినిమాకు మరింత ఆకర్షణ చేకూరేది. అనుష్క డేట్స్ అడ్జెస్ట్ చేసి పరిస్థితి లేకపోవడంతో ప్రభాస్, అనుష్క జోడిని మరో మారు స్క్రీన్ పై చూసే అవకాశం చేజారింది. అనుష్క-ప్రభాస్ లది సూపర్ హిట్ జోడి. మొదటిసారి వీరు బిల్లా సినిమా కోసం కలిసి నటించగా, ఆ తర్వాత మిర్చి, బాహుబలి చిత్రాలలో కలిసి నటించారు. సాహో లో కూడా ఆమె నటిస్తే ఐదు సార్లు కలిసి నటించినట్లయ్యేది.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus