అనుష్క హీరో దొరికాడు!

అనుష్క ప్రస్తుతం ‘బాహుబలి 2’ సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతోంది. ఈ సినిమా కాకుండా రీసెంట్ గా అశోక్ అనే డైరెక్టర్ చెప్పిన కథ నచ్చడంతో ‘భాగమతి’ అనే సినిమాలో నటించడానికి ఓకే చెప్పింది. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో విలన్ గా మలయాళ నటుడు జైరామ్ ను సెలెక్ట్ చేసుకున్నారు.

అలానే హీరో కోసం చాలా మందిని అనుకున్నారు కానీ ఎవరిని ఫైనల్ చేయలేదు. తాజాగా ఈ సినిమాలో హీరో కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తోంది. మలయాళంలో హీరోగా సినిమాలు చేస్తోన్న ఉన్ని ముకుందన్ ప్రస్తుతం తెలుగులో ‘జనతా గ్యారేజ్’ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు.

కానీ ఈ సినిమాలో ఆయనది విలన్ రోల్. కానీ రెండో సినిమాకే తెలుగులో హీరో ఛాన్స్ దక్కించుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. ఆగస్ట్ లో జరగబోయే ఈ సినిమా షూటింగ్ లో ఉన్ని ముకుందన్ పాల్గొనున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus