ప్రభాస్ సినిమా చెయ్యడం లేదంటున్న అనుష్క టీమ్

సీతగా అనుష్కా శర్మను చూడాలని ఆశపడిన అభిమానులు ఎవరైనా వుండి వుంటే వెరీ వెరీ సారీ! యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కి జోడీగా ఆమెను చూడాలని ఆశపడిన అభిమానులకు కూడా ఎవరైనా వుంటే సారీ. శ్రీరామచంద్రుడిగా ప్రభాస్ యాక్ట్ చేయనున్న సినిమా ‘ఆదిపురుష్’. ఇందులో సీత క్యారెక్టర్ అనుష్కా శర్మ చేసే ఛాన్స్ వుందని వినపడింది. కాని సీతగా అనుష్క యాక్ట్ చెయ్యడం లేదు. అనుష్క టీమ్ ఈ సినిమాపై క్లారిటీ ఇచ్చింది. ‘ఆదిపురుష్’ చేసే ఛాన్స్ లేదని చెప్పింది.

ప్రభాస్ ‘ఆదిపురుష్’ టీమ్ నుండి ఎవరూ తమను కాంటాక్ట్ చెయ్యలేదని అనుష్కా శర్మ టీమ్ అంటోంది. స్క్రిప్ట్ నేరేషన్ పక్కనపెడితే… ఇనీషియల్ డిస్కషన్లు కూడా జరగలేదట. యాక్చువల్ గా ‘ఆదిపురుష్’లో యాక్ట్ చెయ్యడం అనుష్కకు కూడా కుదిరే పని కాదు. జనవరి 2021లో ఆమెకు డెలివరీ అవుతుంది. సేమ్ టైమ్ లో ప్రభాస్ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. డెలివరీ అయిన వెంటనే షూటింగ్ కి రావడం, యాక్ట్ చెయ్యడం కుదరదు. అందుకని, ఈ సినిమాను అనుష్క వదులుకుందని చెప్పుకోవచ్చు.

‘ఆదిపురుష్’ చెయ్యడం లేదు గానీ ఇతర సినిమాలు చేస్తుందని అనుష్కా శర్మ టీమ్ మీడియాకి లీకులు ఇస్తుంది. డెలివరీ అయిన మూడు నాలుగు నెలల తరవాత షూటింగ్స్ చెయ్యాలని అనుష్కా శర్మ అనుకుంటోందట. ఏప్రిల్ 2021లో సెట్స్ వస్తుందట. ఆల్రెడీ స్టోరీలు వింటుందని ఆమె టీమ్ చెబుతోంది.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus