శివుడి సరసన సతీమణి పార్వతీదేవి ఉన్నప్పటికీ.. ఆయన నెత్తి మీద “గంగా” ఉండాల్సిందే. అదే చందాన తాను నటించేది ఈ జోనర్ సినిమా అయినా.. సినిమాలో ఎంత మంది కథానాయకిలున్నా.. నాగార్జునతో అందాల భామ అనుష్క ఒక్క సీన్ లోనైనా రొమాన్స్ చేయాల్సిందే. అది పాట కావచ్చు లేదా ఏదైనా ఫ్లాష్ బ్యాక్ సీన్ కావచ్చు. ఇలా సీన్ తో సంబంధం లేకుండా సినిమాలో ఏదో ఒక చోట అనుష్కతో ఆడిపాడడమో లేక సరసాలాడడమో చేయకపోతే నాగార్జునకు పాలుపోవదేమో. నాగార్జున తాజా సినిమాలను ఒక్కసారి చూస్తే ఆ విషయం అవగతమవుతుంది.
అనుష్క “సూపర్” సినిమా ద్వారా పరిచయం చేసినప్పట్నుంచి.. ఆమెతో ఎక్కువసార్లు నటించడంతోపాటు, తాను నటించే ప్రతి సినిమాలోనూ ఆమెతో ఓ అతిధి పాత్ర పోషించజేయడం రివాజుగా మారిపోయింది. ఇప్పుడు అదే ఆనవాయితీని తాజా చిత్రం “ఓమ్ నమో వెంకటేశా”కు వర్తింపజేస్తున్నాడట నాగ్. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఇప్పటికే విమలారామన్ ను ఓ పాత్ర కోసం ఎన్నుకోగా.. ఈ సినిమాలోనూ ఓ ప్రత్యేక పాత్రను అనుష్కతో పోషింపజేస్తున్నాడట నాగార్జున. ఈ అవినాభావ సంబంధం ఇంకెన్ని సినిమాల వరకూ కొనసాగుతుందో చూడాలి!