మహిష్మతి రాణులను తీర్చిదిద్దిన ప్రశాంతి

ప్రశాంతి తిపిర్నేని.. ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు. ఎందుకంటే బాహుబలి తెరవెనుక శ్రమించిన వేలమందిలో ఈమె ఒకరు. ప్రశాంతిని బాహుబలి ప్రీ రిలీజ్ వేడుక వేదికపై రమా రాజమౌళి అందరికీ స్టయిలిష్ గా పరిచయం చేశారు. వీరిద్దరూ బాహుబలి చిత్రంలోని దేవసేన, అవంతిక, శివగామి పాత్రలకు డ్రస్ లను డిజైన్ చేశారు. బాహుబలి 2 రిలీజ్ అవుతున్న సందర్భంగా ప్రశాంతి ని మీడియా పలకరించగా ఆమె అనేక ఆసక్తికర సంగతులను వెల్లడించారు. “అనుష్క బాహుబలి బిగింగ్ లో ఒక చీరతోనే కనిపిస్తుంది. బాహుబలి 2  లో మాత్రం అనేక రకాల చీరలను ధరిస్తుంది. ఈ మూవీ స్టోరీ ఒక కాలానికి సంబంధించినది కాకపోవడంతో మాకు డిజైన్స్ చేసేందుకు అవకాశం లభించింది.

ఆమె కోసం ఉప్పాడా సిల్క్ తో నేతకారులతో పదమూడు గజలా చీరలను ప్రత్యేకంగా నేయించాం. అందులో అనుష్క అందం రెట్టింపు అవుతుంది” అని వివరించారు. చీరలకు ఉపయోగించిన రంగుల గురించి మాట్లాడుతూ.. “నేటి కాలంలో అనేక రంగులు మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటన్నింటినీ మాహిష్మతి రాజ్యంలో ఉపయోగించలేము. అందుకు సహజసిద్ధమైన రంగులనే వాడాము. ముద్ద మందారం ఎరుపు, రోజా పువ్వుల గులాబీ, పసుపు.. ప్రధానంగా ఈ రంగుల చీరలు కనిపిస్తాయి.” అని వివరించారు. ప్రశాంతి డిజైన్ చేసిన చీరల్లో అనుష్కను చూడాలంటే మరో పది రోజులు వేచి చూడక తప్పదు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus