నిశ్శబ్ధం విడుదల విషయంలో కోన మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా ?

ఎప్పుడైతే “బాహుబలి” చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేశారో.. అప్పట్నుండి ప్రతి భారీ బడ్జెట్ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేసి క్యాష్ చేసుకోవాలని దర్శకనిర్మాతలు ప్రయత్నిస్తూనే ఉన్నారు కానీ.. ఎందుకో ఆ ప్రొసెస్ మరో చిత్రానికి వర్కవుట్ అవ్వలేదు. ప్రస్తుతం అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రల్లో “నిశ్శబ్ధం” చిత్రాన్ని రూపొందిందించిన కోన వెంకట్ కూడా అదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మూగ మహిళగా అనుష్క, అంధుడిగా మాధవన్, పోలీస్ ఆఫీసర్ గా అంజలి ప్రధాన పాత్రలు పోషించగా.. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన “నిశ్శబ్ధం” సినిమాను జనవరి 31న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

అయితే.. ఇటీవల ఫస్ట్ కాపీ అవుట్ పుట్ 3.30 గంటలకుపైనే వచ్చింది. దాంతో ఇంకో 20 రోజులు షూట్ చేసి ఇంకో గంట సినిమా తీయగలిగితే రెండు నెలల గ్యాప్ లో రెండు భాగాలుగా విడుదల చేసి క్యాష్ చేసుకోవచ్చనే ఆలోచన వచ్చిందట కోన వెంకట్ కి. మరి ఈ ఆలోచనకి ఆర్టిస్టులందరూ సహకరిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉండగా.. అనుష్క మాత్రం తదుపరి సినిమాకి ఆల్రెడీ డేట్స్ అడ్జెస్ట్ చేసి ఉండడంతో కష్టమవ్వొచ్చు అని తెలుస్తోంది. చూద్దాం మరి కోన ప్లాన్ ఎంతవరకు సఫలీకృతమవుతుందో.

24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ సాధించిన లిరికల్ సాంగ్స్ ఇవే!
30 సౌత్ ఇండియన్ హీరోయిన్లు మరియు వారి చైల్డ్ హుడ్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus