లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుండీ ప్రేక్షకులకు ఓటిటి సంస్థలే ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నాయి. దీంతో థియేటర్లలో విడుదలకు నోచుకోని సినిమాలను డైరెక్ట్ గా ఓటిటిల్లోకి విడుదల చేసి బయటపడాలని దర్శకనిర్మాతలు కూడా భావిస్తున్నారు. ఈ తరుణంలో శాటిలైట్ రైట్స్ కొనుగోలు చేసిన ఛానల్స్ కు పెద్ద దెబ్బె పడుతుంది. ప్రభాస్ ‘సాహో’, నితిన్ ‘భీష్మ’ చిత్రాలు ఎంత ఘోరమైన ఫలితాలను ఇచ్చాయో.. అందరికీ తెలిసిన విషయమే..!
దీంతో ఇప్పుడు రాబోయే చిన్న మరియు మీడియం రేంజ్ సినిమాలకు శాటిలైట్ రైట్స్ బిజినెస్ వెంటనే పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. పెద్ద పెద్ద హీరోల సినిమాలను కూడా తొందరపడి ఎక్కువ రేటు పెట్టి కొనడానికి సదరు ఛానల్స్ వారు కంగారు పడటం లేదని కూడా స్పష్టమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో.. అదీ ఫ్లాప్ టాక్ వచ్చిన ‘నిశ్శబ్దం’ చిత్రం శాటిలైట్ హక్కులను భారీ రేటు పెట్టి ఓ ప్రముఖ ఛానల్ వారు కొనుగోలు చెయ్యడం అందరినీ షాక్ కు గురిచేస్తుంది.
వివరాల్లోకి వెళితే.. అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘నిశ్శబ్దం’ చిత్రం అమెజాన్ ప్రైమ్లో విడుదలయ్యి ఫ్లాప్ టాక్ ను మూటకట్టుకున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ రెండేళ్ల తరువాత అనుష్క నుండీ వచ్చిన చిత్రం కాబట్టి.. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని బాగానే చూసారు. అయితే సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ.. ‘జీ తెలుగు’ వారు ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ను రూ.8కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఏమైనా డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ తో నిర్మాతలు సేఫ్ అయిపోవడమే కాకుండా లాభాలను కూడా ఆర్జించినట్టు స్పష్టమవుతుంది.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?