ఈ రోజుల్లో ఓ సినిమా చూడటానికి జనాలు థియేటర్ కి రావడానికే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. కంటెంట్ బాగుంటే చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా థియేటర్లకి జనాలు వస్తున్నారు. ఓ రకంగా కంటెంట్ బాగున్న సినిమానే పెద్ద సినిమాగా వారు ట్రీట్ చేస్తున్నారు. కంటెంట్ కనుక బాగోకపోతే.. పెద్ద హీరో సినిమాని అయినా పక్కన పెట్టేస్తున్నారు. అయితే పెద్ద హీరో సినిమాకి ఇంకో సమస్య కూడా ఉంది. అదే టికెట్ రేట్స్ హైక్స్.
పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే దానిపై సహజంగానే అంచనాలు పెట్టుకుంటారు ప్రేక్షకులు. ఆ టైంలో మేకర్స్ కూడా క్యాష్ చేసుకోవడానికి టికెట్ రేట్ల హైక్స్ కి ప్రభుత్వాలకి అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు. సినిమా బాగుంటే మొదటి వారం భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి. ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. పెద్ద హీరోల సినిమాలకి టికెట్ హైక్స్ ఇవ్వడంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా పక్షపాతాలు చూపిస్తున్నాయి అనేది కొందరి మాట.
ఇది ఏపీలో ఎక్కువగా కనిపిస్తుంది. మొన్నటికి మొన్న ప్రభాస్ నటించిన పాన్ ఇండియా సినిమా ‘సలార్’ రిలీజ్ అయితే.. అప్పుడు రూ.40 టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. కానీ ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న రీజనల్ సినిమా ‘గుంటూరు కారం’ కి రూ.50 హైక్ ఇచ్చింది. ’10 రూపాయల తేడాకే ఇంత డిస్కషన్ ఎందుకు?’ అని అంతా అనుకోవచ్చు. ‘సలార్’ ఏపీలో కొన్ని ఏరియాల్లో రికార్డులు కొట్టడానికి చాలా కష్టపడింది.
ఒకవేళ ఇంకో పది రూపాయలు పెంచి ఉండుంటే.. దానికి ఓపెనింగ్స్ ఇంకా పెరిగుండేవి. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఈజీ అయ్యుండేది. ఇప్పుడైతే అది అబౌవ్ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. మహేష్ సినిమాకు (Guntur Kaaram) ఒక న్యాయం.. ప్రభాస్ సినిమాకి ఇంకో న్యాయం అన్నట్టు ఏపీ ప్రభుత్వం వ్యవహరించడంలో అర్ధం ఏమనుకోవాలి?
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!