దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ రియాలిటీ షో. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం వంటి అనేక భాషలలో ప్రసారమవుతున్న ఈ రియాలిటీ షో మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుని నంబర్ 1 గా గుర్తింపు పొందింది. తెలుగులో కూడా ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ప్రస్తుతం ఆరవ సీజన్ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా ఈ రియాలిటీ షో పై కొందరు రాజకీయ నాయకులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.
బిగ్ బాస్ అనేది రియాల్టీ షో కాదని.. ఇది ఒక బూతు షో అని దీనిని బ్యాన్ చేయాలని పలువురు రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ షో లో అశ్లీలత ఎక్కువ ఉందని.. ఈ షో బ్యాన్ చేయాలని హైకోర్టు లో కూడా పిటిషన్ దాఖలు చేశారు. బిగ్ బాస్ షో లో అశ్లీలత ఎక్కువగా ఉందని పిటీషనర్ తరపు న్యాయవాది శివ ప్రసాద్ రెడ్డి వాదనలు వినిపిస్తూ…
టీవీలో ప్రసారమవుతున్న రియాలిటీ షోలు ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్ గైడ్లైన్స్ పాటించడం లేదని వాదన వినిపించారు. అయితే ఈ వాదనాలపై స్పందించడానికి కేంద్రం తరపు న్యాయవాది హైకోర్టును సమయం కోరారు. ఈ వాదనాలపై ఏపీ హైకోర్టు ఘాటుగా స్పందిస్తూ 1970 లోనే ఎలాంటి సినిమాలు వచ్చాయన్నది తెలుసు కదా అని తెలిపింది.
ఈ క్రమంలో ఈ వాదనాలపై ప్రతి వాదులకు నోటీసులపై తదుపరి వాయిదాలో నిర్ణయిస్తామని హైకోర్టు పేర్కొంది. ఈ క్రమంలో ఈ విచారణను అక్టోబర్ 11వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. అయితే బిగ్ బాస్ రియాలిటీ షో విషయంలో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.
Most Recommended Video
అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!