ఒక పాత్ర కోసం నందమూరి బాలకృష్ణఎక్కడి వరకైనా వెళ్తారు చివరికి ప్రాణం పెట్టేస్తారు. అది ఎలాంటి పాత్ర అయినా కావచ్చు. అందులో పరకాయ ప్రవేశం చేసే అద్భుతంగా నటిస్తారు. ఈ వయసులోనూ యువ హీరోలకు ధీటుగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడతారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ప్రస్తుతం ‘అఖండ’, ‘వీర సింహారెడ్డి’ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్న బాలయ్య త్వరలోనే ‘భగవంత్ కేసరి’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
అయితే తాజాగా బాలయ్య (Balakrishna) గొప్పతనం గురించి, ఆయన సినిమా కోసం ఏం చేయడానికైనా సిద్ధం అవుతారనే విషయాన్ని ప్రముఖ నటుడు అప్పాజీ అంబరీష ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.” బాలకృష్ణ గారు నటించిన ఎన్టీఆర్ బయోపిక్ లో నేను కూడా నటించాను. ఎన్టీఆర్ కథానాయకుడు క్లైమాక్స్ లో నా పాత్ర ఎంట్రీ ఉంటుంది. ఎన్టీఆర్ మహానాయకుడులో ఫుల్ లెన్త్ రోల్ చేశాను.
సినిమాలో జీవన్ రెడ్డి పాత్ర చేశాను. ఎన్టీఆర్ రియల్ లైఫ్ లో నన్నపని రాజకుమారి వాళ్ళు సీనియర్ ఎన్టీఆర్ ముందు గాజులు పగలగొట్టే సీన్ ని షూట్ చేస్తున్నాం. ఆ సీన్ లో బాలయ్య గారి ముందు గాజులు పగలగొట్టి, ఉమ్మివేయడానికి భయపడుతున్నారు. అప్పుడు బాలయ్య గారు వాళ్లతో మనం జరిగింది చేస్తున్నాం. మీరేం భయపడకుండా నిజంగానే గాజులు పగలగొట్టి నా మీద ఉమ్మి వేయండి. ఉమ్మివేసినట్టు నటించకండి, నిజంగానే ఉమ్మేయండి అని చెప్పడంతో నేను షాక్ అయిపోయాను” అని అన్నారు.