Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » ఏప్రిల్ 24 న ప్రముఖ నిర్మాత శ్రీ ఏడిద నాగేశ్వరరావు 84 వ జయంతి

ఏప్రిల్ 24 న ప్రముఖ నిర్మాత శ్రీ ఏడిద నాగేశ్వరరావు 84 వ జయంతి

  • April 23, 2018 / 11:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఏప్రిల్ 24 న ప్రముఖ నిర్మాత  శ్రీ ఏడిద నాగేశ్వరరావు 84 వ జయంతి

శంకరాభరణం ,సాగరసంగమం,స్వయంకృషి ,స్వాతిముత్యం , ఆపత్బాంధవుడు , సితార , సీతాకోకచిలుక మొ: కళాత్మక దృశ్య కావ్యాలను ప్రపంచానికి అందించిన ప్రముఖ చలనచిత్ర చిత్ర నిర్మాత శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారి 84 వ జయంతి సందర్భంగా ఆయన మనకు అందించిన ఆణి ముత్యాల్లాంటి చిత్రాల గురించి గుర్తు చేసుకుందాం . కాలేజీ రోజుల నుండి నాటక అనుభవం ఉన్నందున , ఆయన దృష్టి నటన పై పడి, మద్రాస్ రైలెక్కిన ఈయనకు నిరాశే మిగిలింది .చేసేది లేక అక్కడే స్థిరపడి చిన్నా చితకా వేషాలు వేస్తూ, డబ్బింగులు చెబుతూ , నానా కష్టాలూ పడుతూ బతుకు కొన సాగించారు . అలాంటి సమయంలో 1976 లో ఆయన మిత్రుల ప్రోత్సాహంతో సిరి సిరి మువ్వ చిత్రానికి నిర్వహణ బాధ్యతులు వహించి మంచి విజయం సాధించారు . ఆ విజయం ఇఛ్చిన ఉత్సాహంతో పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ సంస్థను స్థాపించి మొదటి చిత్రంగా తాయారమ్మ బంగారయ్య చిత్రాన్ని నిర్మించారు . అది మంచి విజయం సాధించింది .తదుపరి చిత్రం కళా తపస్వి కే. విశ్వనాధ్ గారి దర్శకత్వంలో శంకరాభరణం . తెలుగు చిత్ర ఖ్యాతని ఖండాంతరాలకు తీసుకు వెళ్లిన అద్భుత కావ్యం . ఈ చిత్రానికి వచ్చినంత పేరు ప్రఖ్యాతలు , box office కలెక్షన్స్ గాని , జాతీయ – అంతర్జాతీయ – రాష్త్ర అవార్డులు ఏ చిత్రానికీ రాలేదంటే , అతిశయోక్తి కాదు. జాతీయ స్థాయిలో స్వర్ణ కమలం పొందిన మొట్ట మొదటి చిత్రం . అలాగే ఏ దేసేమెళ్లినా శంకరాభరణం గురించి ప్రస్తావనే అప్పట్లో .ఆ తర్వాత వచ్చిన సీతాకోకచిలుక అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్ . ఇప్పుడు వస్తున్న అనేక విజయవంతమైన ప్రేమ కధా చిత్రాలకు సీతాకోకచిలుక చిత్రమే ఇన్స్పిరేషన్

ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది . ఏడిద నిర్మించిన తదుపరి చిత్రం, కమలహాసన్ కే.విశ్వనాధ్ కాంబినేషన్ లో సాగర సంగమం. ఈ చిత్రానికి కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు . అవార్డులు తో పాటు రివార్డులు సొంతం చేస్కుకున్నదీ చిత్రం . తెలుగు, తమిళం & మలయాళం లో ఒకే సారి విడుదలయ్యి సూపర్ హిట్ అయ్యింది . తదుపరి చిత్రం మరో క్లాసిక్ – సితార . ఏడిద వద్ద అప్పటి వరకూ అన్ని చిత్రాలకూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన వంశీ దర్శకత్వం లో సుమన్, భానుప్రియ జంటగా వచ్చిన ever green classic . సితార కి కూడా జాతీయ అవార్డుల్లో పెద్ద చోటే దక్కింది .ఇక స్వాతిముత్యం – కే.విశ్వనాధ్ కమలహాసన్ రాధిక ల కలయిక లో వచ్చిన ఆణిముత్యం . 1986 లో విడులయ్యిన ఈ చిత్రం , అప్పటికి బాక్స్ ఆఫీస్ records ని బీట్ చేసింది . జాతీయ అవార్డు , రాష్ట్ర బంగారు నంది పొందిన ఈ ముత్యం ప్రతిషాత్మక ఆస్కార్ అవార్డులకు భారత దేశం తరపున ఎన్నుకోబడిన మొట్ట మొదటి తెలుగు చిత్రం . ఇక స్వయంకృషి – మెగాస్టార్ చిరంజీవి తో ఏ కమర్షియల్ చిత్రమో తియ్యకుండా , ఓ సాధారణ చెప్పులు కొట్టుకునే సాంబయ్య పాత్రతో సినిమా తియ్యడం పెద్ద సాహసమే . అది విజయవంతం చేసి అందరి మన్ననలూ పొందారు ఏడిద . మంచి విజయం సాధించిన ఈ చిత్రం , చిరంజీవి కి మొట్ట మొదటి సారి ఉత్తమ నటుడిగా రాష్ట్ర నంది అవార్డు దక్కించింది .ఇక ఆయన రెండో కుమారుడు శ్రీరాం హీరో గా చేసిన స్వరకల్పన ఆశించనంతగా ఆడలేదు . మళ్ళీ విశ్వనాధ్ – చిరంజీవిలతో తీసిన చిత్రం , ఆపత్బాంధవుడు . చిరంజీవి నట విశ్వరూపానికి ఓ మంచి ఉదాహరణ . రెండవ సారి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ నటుడిగా నంది అవార్డు .అలాగే జాతీయ ఉత్తమ నటుడిగా కొంచంలో మిస్ అయ్యింది . ఇన్ని గొప్ప చిత్రాలు నిర్మించడానికి సాహసించిన శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారికి , మన ప్రభుత్వం తరపున సరైన గుర్తింపు లభించలేదు అంటే సినీ అభిమానులకు చాలా నిరాశే . పద్మ అవార్డుల్లో కానీ , రాష్ట్ర ప్రభుత్వ రఘుపతి వెంకయ్య అవార్డుకి కానీ ఆయన అన్నివిధాలా అర్హులే . కనీసం కీర్తిశేషులైన తర్వాత ఆయనకీ తగిన విధముగా పురస్కారం మన తెలుగు ప్రభుత్వాలు అందిస్తే , చిత్ర సీమలో ఆయన చిత్రాలు ఎలాగైతే మరపురాని ఆణిముత్యాల్లా మిగిలాయో, అలాగే ఆయన కీర్తి ప్రతిష్టలను
గౌరవించిన వారౌతారు .

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Edida Nageswara Rao
  • #Edida Nageswara Rao Movies
  • #Producer Edida Nageswara Rao

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

11 mins ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

20 hours ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

22 hours ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

23 hours ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

1 day ago

latest news

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

1 day ago
Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

1 day ago
Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

1 day ago
Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

1 day ago
Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version