రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి'(Bhartha Mahasayulaku Wignyapthi) అనే సినిమా తెరకెక్కుతుంది. ‘ఎస్ ఎల్ వి సినిమాస్’ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘రామారావ్ ఆన్ డ్యూటీ’ వంటి డిజాస్టర్ తర్వాత ఈ బ్యానర్లో రవితేజ చేస్తున్న సినిమా ఇది. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. భీమ్స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన ‘బెల్లా బెల్లా’ ‘అద్దం ముందు నిలబడి’ వంటి పాటలకి మంచి రెస్పాన్స్ లభించింది. కొద్దిసేపటి క్రితం టీజర్ ను కూడా వదిలారు.ఈ టీజర్ విషయానికి వస్తే.. ఇది 1:30 నిమిషాల నిడివి కలిగి ఉంది. రామ సత్యనారాయణ(రవితేజ) తన అసిస్టెంట్(వెన్నెల కిషోర్) ని తీసుకుని కమల్ హాసన్ నాయుడు అనే సైకాలజిస్ట్(మురళీధర్ గౌడ్) వద్దకు వెళ్లడం.

అక్కడ అతను తన లైఫ్ ని ఓపెన్ చేయడం జరిగింది. పెళ్ళై ఫ్యామిలీతో కలిసుంటున్న హీరో ఆఫీస్ పనిమీద విదేశాలకి వెళ్లడం.. అక్కడ మరో అమ్మాయితో సహజీవనం మొదలుపెట్టడం.. ఆ తర్వాత భార్యకి, ప్రియురాలికి మధ్య ఎలా నలిగిపోయాడు అనేది మిగిలిన కథగా.. తెలుస్తుంది. ఈ టీజర్ తో సినిమా కోర్ పాయింట్ ఏంటన్నది చెప్పేశారు. సినిమాలో కిషోర్ తిరుమల మార్క్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ నిండుగా ఉంటాయని చెప్పకనే చెప్పారు.
సంక్రాంతి సినిమా కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ గా టీజర్ ను కట్ చేసినట్టు స్పష్టమవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :
