భారతీయ సినిమా సంగీతానికి ప్రపంచ వేదికల మీద గుర్తింపు తెచ్చిన సంగీత దర్శకులు అనే జాబితా సిద్ధం చేస్తే… అందులో కచ్చితంగా ఏ.ఆర్.రెహమాన్ పేరు ఉంటుంది. అంతలా తన సంగీతంతో అలరించిన రెహమాన్ వారసురాలు ఇప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మేరకు ఆమె తొలి సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడింది. ఆస్కార్ అవార్డు విజేత అయిన రెహమాన్ కుమార్తె ఖతీజా రెహ్మాన్ ఓ తమిళ సినిమాతో మ్యూజిక్ డైరక్టర్ అవుతున్నారు.
‘సిల్లు కారుపట్టి’ సినిమా దర్శకురాలు హలిత షమీమ్ కొత్తగా ‘మిన్మిని’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంగీత దర్శకురాలిగా ఖతీజా రెహమాన్‌ను ఎంచుకున్నారు. దీంతో సంగీత దర్శకురాలిగా ఖతీజా అరంగేట్రం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని సినిమా టీమ్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. రికార్డింగ్ స్టూడియోలో ఖతీజాతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ఈ విషయం చెప్పారు. ‘మిన్మిని’ సినిమా కోసం ఖతీజా రెహమాన్‌తో కలసి పని చేస్తున్నందుకు సంతోషంగా ఉంది అంటూ పోస్ట్‌లో పేర్కొన్నారు.
‘మిన్మినీ’లో ఎస్తేర్ అనిల్, హరి కృష్ణన్, గౌరవ్ కళై, ప్రవీణ్ కిషోర్ తదితరులు ప్రధాన పాత్రధారులు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తై, పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. తండ్రి, సోదరుడు అమీన్ అడుగుజాడల్లో ఖతీజా నడుస్తుండడంపై ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ చెబుతూ సోషల్ మీడియా విషెష్ తెలియజేస్తున్నారు. రజనీకాంత్ – శంకర్‌ల ‘ఎంథిరన్ / రోబో’ సినిమాతో ఖతీజా ప్లేబ్యాక్ సింగర్‌గా అరంగేట్రం చేశారు.
(AR Rahman) రెహమాన్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలసి ‘పుతియ మనిధ…’ అనే పాటకు గాత్రం అందించారు. ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లోనూ పాటలు పాడారు. ‘మిమీ’ (హిందీ), ‘ఇరవిన్ నిలల్’, ‘మిలి’ (హిందీ), ‘పొన్నియిన్ సెల్వన్ 2’ (తమిళం) చిత్రాల్లో ఖతీజా పాటలు పాడారు. ఇప్పుడు మ్యూజిక్ కంపోజర్ అవుతున్నారు. దీంతో ఈ రంగంలోనూ ఆమె అదరగొట్టాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!