Prabhu Solomon: ‘అరణ్య’ దర్శకుడి జీవితంలో ఈ కోణమూ ఉంది

సినిమా ఛాన్స్‌ల కోసం నానా కష్టాలు పడిన వారిని చూసుంటారు. వారి కష్టాలు వినుంటారు. అదే ఓ సినిమా తీసి, హిట్‌ కొట్టి, మంచి దర్శకుడు అనిపించుకున్నాక… కష్టాల్లో పడితే, అప్పుల పాలైతే, ఆ అప్పు కట్టలేక పారిపోయే పరిస్థితి వస్తే… అది కచ్చితంగా ‘అరణ్య’ దర్శకుడు ప్రభు సాల్మన్‌ జీవితమే అవుతుంది. వైవిధ్యమైన సినిమాలు కేరాఫ్‌ చిరునామాగా నిలిచిన ప్రభు సాల్మన్‌ జీవితం అనవసర ఖర్చులు పెట్టేవారికి గుణపాఠంలా నిలుస్తుంది కూడా. ఇంతకీ ఆయన కథేంటో చూద్దాం! ప్రభు సాల్మన్‌ది తమిళనాడులోని నైవేలి. తిరుచ్చిరాపల్లిలో ఆయన డిగ్రీలో చేరారు.

అప్పుడే సినిమాలంటే ఏమిటో తెలిసిందాయనకు. కాలేజీల్లో వేసే నాటకాల్లో చురుగ్గా పాల్గొనేవారట. ఆయన రచనా తీరూ, దర్శకత్వ శైలి చూసి స్నేహితులు తెగ మెచ్చుకునేవారట. ఆ ప్రభావమో ఏమో… ఆయనలో సినిమా పిచ్చి మొదలై, పీజీ అయ్యేసరికి అది బాగా ముదిరిందట. దాంతో చాలామందిలాగే చెన్నై బస్సెక్కారట. మూడేళ్లు స్టూడియోల చుట్టూ తిరిగితే ఓ సినిమాలో శరత్‌కుమార్‌కి ‘డూప్‌’గా తీసుకున్నారట. అక్కడ దర్శకుడు అగత్తియన్‌ సాయంతో ‘ప్రేమలేఖ’ సినిమాకి సహాయ దర్శకుడయ్యారాయన. ఆ సినిమా దర్శకుడు మధ్యలోనే పక్కకు తప్పుకోవడంతో దర్శకుడిగా మారిపోయారు. అయితే దర్శకుడి కార్డులో ప్రభు పేరుండదు.

ఆ తర్వాత అర్జున్‌ హీరోగా ‘కన్నోడు కాన్బదెల్లామ్‌’ (తెలుగులో ప్రేమ ఘర్షణ) సినిమా చేశాను. ఆ సినిమా హిట్‌ అవ్వడంతో పరిశ్రమలో మంచి గుర్తింపు దక్కింది. అయితే చేతిలో డబ్బులు మిగల్లేదట. అయితే దర్శకుడిగా లెవల్ మెయిన్‌టైన్ చేయాలని పెద్ద ఇల్లు అద్దెకు తీసుకున్నారట ప్రభు సాల్మన్‌. ఆడంబరాలకు పోయి, అప్పులు చేశారట. వాటికి తాగుడు అలవాటూ యాడింగ్‌. దీంతో ఆర్థిక, కుటుంబ పరిస్థితి కుదేలైపోయిందట. ఇంటి అద్దె చెల్లించలేక రాత్రికి రాత్రి ఇల్లు ఖాళీ చేసి రోడ్డున పడ్డారట. విషయం అర్థం చేసుకొని దురలవాట్లు తగ్గించుకొని, ఉన్నంతలో బతకం నేర్చుకున్నారట. ఆ తర్వాత ‘కొక్కి’ అనే సినిమా తీసి, మళ్లీ పెద్ద హిట్‌ కొట్టాడు. ఆ డబ్బుతో అప్పులు తీర్చేసి, భార్య పునీతకే ఆర్థిక బాధ్యతలు అప్పగించారట. ఆ తర్వాత ఎప్పుడూ సమస్యలు రాలేదట.

Most Recommended Video

వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus