రికార్డ్ ధరకి అమ్ముడుపోయిన “అరవింద సమేత” శాటిలైట్ హక్కులు!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ నిన్న రిలీజ్ అయి రికార్డుల వేట మొదలు పెట్టింది. తొలిసారి తారక్ రాయలసీమ యాసలో మాట్లాడం… సిక్స్ ప్యాక్.. ఎన్టీఆర్ కి మెగా హీరో నాగబాబు తండ్రిగా నటించడం.. భారీ యాక్షన్ సీన్స్.. థమన్ నేపథ్య సంగీతం.. ఇలా ఎన్నో అంశాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు 26  కోట్ల షేర్ రాబట్టి ఔరా అనిపించింది. విదేశాల్లోనూ జోరుగా దూసుకుపోతోంది. ఓవర్ సీస్ లో అత్యంత వేగంగా వన్ మిలియన్ డాలర్లను వసూలు చేసింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా “అరవింద సమేత” తొలిరోజు 36 కోట్ల షేర్ అందుకుంది.

ఈ కలక్షన్స్ చూసి తెలుగు ఛానల్స్ వాళ్ళు “అరవింద సమేత” శాటిలైట్ హక్కులను సొంతం చేసుకోవడానికి పోటీ పడ్డాయి. తాజాగా అందిన సమాచారం మేరకు 23.50 కోట్లకు ఓ ఛానల్ వాళ్ళు సొంతం చేసుకున్నట్టు తెలిసింది. ఎన్టీఆర్ సినిమాకు ఈ స్థాయిలో శాటిలైట్ హక్కులు పలకడం ఇదే తొలిసారి.  దీంతో చిత్ర బృందం సంతోషంలో ఉంది. దసరా సెలవులు రావడంతో అరవింద సులువుగా 100 కోట్ల క్లబ్ లో చేరిపోతోందని ట్రేడ్ వర్గాలవారు చెప్పారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus