భారీ ధరకు అమ్ముడు పోయిన ఎన్టీఆర్ మూవీ రైట్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీ షూటింగ్ పూర్తి అయ్యే వరకు డిస్ట్రిబ్యూటర్స్ ఆగడం లేదు. మొదలవగానే బేరసారాలు మొదలెట్టేస్తున్నారు. తారక్ కి ఉన్న క్రేజ్ అది. వరుసగా నాలుగు విజయాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్.. త్రివిక్రమ్ తో కలిసి మరో హిట్ అందుకోబోతున్నారు. వీరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న “అరవింద సమేత వీర రాఘవ” ఇప్పటికే 40 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. పూర్తి చేసుకున్న సన్నివేశాలకు డబ్బింగ్ పనులను కూడా ప్రారంభించారు. ఈ సినిమాలో జగపతిబాబు, నాగబాబు రెండు ఫ్యాక్షన్ గ్రూపులకు చెందిన నాయకుల పాత్రల్లో నటిస్తున్నారు. హీరోయిన్స్ గా పూజా హెగ్డే, ఈషా రెబ్బ కనువిందు చేయబోతున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ పతాకం ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.

భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ చిత్రం అక్టోబర్ 10 న థియేటర్లోకి రానుంది. అయితే ఇప్పుడే ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయినట్లు సమాచారం. మొత్తం 40 కోట్లు పలికినట్లు తెలిసింది. అందులో ఈస్ట్ గోదావరిని వి 3 సంస్థ 6.40కి … వెస్ట్ గోదావరిని ఎల్విఆర్ సంస్థ 5.55 కోట్లకు… ఇక నెల్లూరును భాస్కర రెడ్డి 3.15 కు తీసుకున్నట్లు టాక్. మిగతా ఏరియాల రైట్స్ త్వరలో బయటికి రానుంది. ఆంధ్రలో 40 కోట్లు పలకగా నైజాంలో 20 కోట్లు, సీడెడ్ లో 12 కోట్లు క్రాస్ చేస్తుందని ట్రేడ్ వర్గాల వారు చెప్పారు. సో తెలుగు రాష్ట్రాల థియేటర్ల బిజినెస్ 70 కోట్లు మించిపోయేలా ఉంది. ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలుపుకుంటే వందకోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ గ్యారంటీ.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus