ARI: కంటతడి పెట్టించేలా ‘అరి’ దర్శకుడి ఎమోషనల్ కామెంట్స్

అనసూయ, సాయి కుమార్, వైవా హర్ష వంటి వారు ప్రధాన పాత్రల్లో ‘అరి’ రూపొందింది. ‘పేపర్ బాయ్’ తో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జయశంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 7 ఏళ్ళు టైం తీసుకుని ఆయన ఈ చిత్రాన్ని రూపొందించారు. హిమాలయాలు, ఆధ్యాత్మిక ఆశ్రమాలు చుట్టూ తిరిగి స్క్రిప్ట్ ను డెవలప్ చేసుకున్నారు. అరి షడ్వర్గాల అనే కొత్త కాన్సెప్ట్‌ తో ఈ సినిమాని రూపొందించారు.

ARI

ఇలాంటి కాన్సెప్ట్ ఇప్పటివరకు తెలుగు సినిమా పరిశ్రమలో రాలేదని తెలుస్తుంది. అక్టోబర్ 10న ‘అరి’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇదిలా ఉండగా.. ‘అరి’ సినిమా చిత్రీకరణ దశలో ఉండగా దర్శకుడు జయశంకర్ తన జీవితంలో అత్యంత కీలకమైన ఇద్దరు వ్యక్తులను కోల్పోయినట్టు తెలుస్తుంది. వీరిలో ఆయన తండ్రి వంగ కనకయ్య అలాగే ఆయన బావ కె.వి.రావు వంటి వారు ఉన్నారు. వారి గురించి జయశంకర్ చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతుంది.”రేపటి నుండి ‘అరి’ ఇక ఆడియన్స్ సొంతం.

ఈ మూవీ నాకు ఎప్పటికీ ఎంతో ప్రత్యేకమైనది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నా జీవితానికి మూల స్తంభాలైన మా తండ్రి గారు (వంగ కనకయ్య), బావ గారు (కె.వి. రావు) మరణించారు. నేను వారిద్దరినీ కోల్పోయాను. ‘అరి’ చిత్రంలోని ప్రతి ఫ్రేమ్‌పై వారి ఆశీస్సులు ఉంటాయి. ఈ సినిమాను నేను ఆ ఇద్దరికీ అంకితం చేస్తున్నాను” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

టేబుల్‌ మీద ఫుడ్‌.. ఎదురుగా బిగ్‌ స్క్రీన్‌.. డైన్‌ ఇన్‌ సినిమా వచ్చేస్తోంది!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus