బిగ్ బాస్ 4: అరియానా ఆకలి ఆవేదన..!

బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ డ్రామా ఎపిసోడ్ ఆడియన్స్ కి మంచి కిక్ ఇస్తోంది. అందరూ కూడా లాస్య బాబు జున్నుబాబుకోసం చాలా ఎదురుచూస్తున్నారు. అయితే, హౌస్ మేట్స్ అందరి తరపున వచ్చిన బంధువులు హౌస్ మేట్స్ అందర్నీ పలకరిస్తూ సందడి చేశారు.

అవినాష్ మదర్ వచ్చి వెళ్లిపోయాక హౌస్ మేట్స్ అందరూ ప్రశాంతంగా నిద్రపోయారు. కానీ అరియానా చాలా కలవరపడింది. తన ఫ్యామిలీ తరపునుంచి అసలు ఎవరైనా వస్తారా లేదా అని దిగులుచెందింది. కానీ, అరియానా ఫ్రెండ్ వినీత్ హౌస్ లోకి వచ్చి సందడి చేశాడు. అంతేకాదు, అరియానాతో కాకుండా మిగతా హౌస్ మేట్స్ ని పలకిరిస్తుంటే అరియానా ఆవేశపడిపోయింది. ఎమోషనల్ అయిపోయింది. ఏడుస్తూ మాట్లాడుతూ వినీత్ ని ఎంత మిస్ అవుతున్నానో చెప్పింది. నీ విలువ ఏంటో తెలుస్తోంది అంటూ మాట్లాడింది.

లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ షో చూసేటపుడు పాప, నువ్వు బిగ్ బాస్ కి వెళ్తే డొక్కుకారు తెచ్చి అయినా సరే వీలెవల్లో డ్యాన్స్ చేద్దాం అన్నావ్ గుర్తుందా అంటూ గుర్తు చేసింది. బిగ్ బాస్ నీ పేరు పిలిచాడు చూడు అంటూ మాట్లాడింది. అంతేకాదు, తనకి కావాల్సిన బట్టలు , చెప్పులు తీస్కుని రమ్మని మరీ చెప్పింది.

హౌస్ మేట్స్ కి తన ఫ్రెండ్ వినీత్ ని పరిచయం చేస్తూ మా ఇద్దరిదీ 12యేళ్ల ఫ్రెండ్షిప్ అని, 9వ తరగతి నుంచి తను నన్ను బాగా చూసుకునేవాడని చెప్పింది. అంతేకాదు, తను ఆకలిబాధలో ఉన్నప్పుడు వాళ్లింటికెళ్లి అన్నం తినేదాన్ని అని, అది కూడా బాగా డిమాండ్ చేసి మరీ లాక్కునేదాన్ని అని చెప్పింది. ఐలవ్ యూ.. వినయ్ అంటూ ముందుగా పిలుస్తూ.. నాకు కష్టం వచ్చిన ప్రతిసారి అందులో నువ్వు ఉన్నావ్.. నీకు రుణపడి ఉన్నా అంటూ ఆవేదన చెందింది అరియానా. హౌస్ మేట్స్ అందరూ అరియానాని కాసేపు ఓదార్చారు.

Most Recommended Video

ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?
ఈ 12 మంది ఆర్టిస్ట్ ల కెరీర్.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారానే మొదలయ్యింది..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus