Bigg Boss 7 Telugu: ఫన్ టాస్క్ లో లొల్లి..! కావాలనే అర్జున్ అలా చేశాడా ? ఏం జరిగిందంటే.,

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం పార్టిసిపెంట్స్ ఓట్ అప్పీల్ కోసం వెంపర్లు ఆడుతున్నారు. దీనికోసం బిగ్ బాస్ పెట్టిన ఫన్ గేమ్స్ లో సీరియస్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా బిగ్ బాస్ అందరికీ ఒక టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇసుకతో కేక్ ని చేసి, స్వైపింగ్ కార్ట్ తో పీసెస్ చేయమని చెప్పాడు. దాని పైన ఉన్న చెర్రీ కింద పడకుండా ఒక్కొక్కరు పీసెస్ కట్ చేయమని ఆదేశించాడు. దీంతో పార్టిసిపెంట్స్ చాలా మెల్లగా ముక్కలు కోయడం ప్రారంభించాడు. మొదటి రౌండ్లో అర్జున్ అవుట్ అయ్యాడు.

ఆ తర్వాత ఒక్కొక్కరుగా అవుట్ అవుతూ వచ్చారు. ఫైనల్ గా అమర్ ఇంకా పల్లవి ప్రశాంత్ ఇద్దరు మాత్రమే మిగిలారు. లాస్ట్ లో పల్లవి ప్రశాంత్ అవుట్ అయితే, అమర్ విన్నర్ అయ్యాడు. అమర్ దీప్ ఓటింగ్ అప్పీల్ కోసం కంటెండర్ గా నిలిచాడు. మరో కంటెండర్ కోసం మరో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఎవరైతే ముందుగా వెళ్లి బెల్ కొడతారో వాళ్లు కన్ఫెషన్ రూమ్ లో గేమ్ ఆడాల్సి ఉంటుందని చెప్పాడు. దీనికోసం హౌస్ మేట్స్ పోటీ పడ్డారు. ఇక్కడే అర్జున్ – పల్లవి ప్రశాంత్ గొడవ పడ్డారు. అసలు ఏం జరిగిందంటే.,

బజర్ మోగగానే ఆవేశంగా పల్లవి ప్రశాంత్ పై చేయి విసిరేసి పక్కకి నెట్టేస్తూ పరిగెత్తాడు అర్జున్. ఆ తర్వాత యావర్ అర్జున్ ని పల్లవి వైపు పుష్ చేస్తే పల్లవి ప్రశాంత్ అర్జున్ ని ఆపేందుకు ప్రయత్నించాడు. అయినా కూడా స్పీడ్ లో అర్జున్ వాళ్లిద్దరినీ తప్పించుకుంటూ వచ్చి మరీ బెల్ కొట్టాడు. ఇక్కడే పల్లవి ప్రశాంత్ నువ్వు నన్ను నూకేసినావ్ అంటూ గొడవ పెట్టుకున్నాడు. అర్జున్ నా రన్నింగ్ స్టైల్ అలాగే ఉంటుంది. నువ్వు నా చేయి పక్కన నుంచున్నావ్ అంటూ ఎదురుదాడి చేశాడు.

ఇద్దరి మద్యలో మాటకి మాట పెరిగింది. స్మిమ్మింగ్ పూల్ టాస్క్ లో నీ చేయి నాకు తగిలింది. నేను ఏమైనా అన్నానా , ఆటలో ఇలా అవుతుంది దానికెందుకు నన్ను ఆపాలని చూశావ్ అది కూడా నీ తప్పే అంటూ గట్టిగట్టిగా అరిచాడు. ఫస్ట్ నుంచీ చూస్తున్న ప్రతిదీ కూడా నీకే కావాలనుకుంటావ్ ? ప్రతిసారి ఏదో ఒకటి ఓడిపోతే మాట్లాడుతుంటావ్ అంటూ అర్జున్ సీరియస్ అయ్యాడు. పల్లవిపై తనకి ఉన్న పగ – కసి మొత్తం తీర్చేసుకున్నాడు. నిజానికి అర్జున్ కావాలనే అలా చేశాడా ?

అర్జున్ స్మిమ్మింగ్ పూల్ టాస్క్ లో పల్లవి ప్రశాంత్ వల్ల హర్ట్ అయ్యాడు. తనవల్లే పక్కకి తప్పుకున్నాడు. అయినా కూడా పల్లవి ప్రశాంత్ సంచాలక్ మాట వినకుండా నాకు వీడియో కావాలంటూ గోల చేశాడు. అలాగే, ఇప్పుడు కూడా అర్జున్ నెట్టేస్తే, నాకు వీడియో కావాలి బిగ్ బాస్ అంటూ రిక్వస్ట్ చేశాడు. ఫన్ టాస్క్ లో మాములుగా ఆడరా బాబూ అంటూ అర్జున్ చెప్తున్నా కూడా వినిపించుకోలేదు. సోది చెప్పకు, ఎధవరీజన్స్ చెప్పమాక అంటూ అర్జున్ పల్లవిపై విరుచుకుని పడ్డాడు. నోర్ముయ్, ఎక్కువ మాట్లాడకూ అంటూ అరిచి మరీ చెప్పాడు.

శివాజీ పల్లవి ప్రశాంత్ ని వదిలేసేయ్ అంటూ కౌన్సిలింగ్ చేశాడు. సోధి చెప్పకు, పూల్ టాస్క్ లో నీ మోచేయి తగిలింది కానీ నేను ఆపలేదు అంటూ అర్జున్ పల్లవి కి ఎక్స్ ప్లనేషన్ ఇచ్చాడు. బుర్ర పెట్టుకుని ఫస్ట్ చెప్పేది విను., నీ చేయి నాకు తగిలింది. కానీ, నేను పూల్ టాస్క్ లో ఆపలేదు, కానీ నువ్వు ఆపావ్ అది కరెక్ట్ గేమ్ కాదు అంటూ వాగ్వివాదం పెట్టుకున్నాడు. ఇద్దరి మద్యలో హీటెడ్ ఆర్గ్యూమెంట్ అయ్యింది. అయితే, అర్జున్ కావాలనే అలా చేశాడనే వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదీ మేటర్.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus