Arjun Ambati wife Surekha: తండ్రి కాబోతున్న బిగ్ బాస్ కంటెస్టెంట్.. ఏకంగా ‘బిగ్ బాస్’ హౌస్లోనే..!

‘బిగ్ బాస్’ లో ఇప్పటివరకు కంటెస్టెంట్లు తిట్టుకోవడం, హత్తుకోవడం, నామినేట్ చేసుకోవడం వంటివి మాత్రమే చూశాం. కానీ మొదటిసారి ఓ సీమంతం వేడుక కూడా చూడబోతున్నాం. అవును.. అదెలా అనుకుంటున్నారా అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ‘అగ్ని సాక్షి’ సీరియల్ ఆర్టిస్ట్ అయిన అర్జున్ అంబటి అందరికీ సుపరిచితమే. ఆ సీరియల్ తో అతను మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ‘దేవత’ అనే సీరియల్ తో కూడా అతను భీభత్సమైన పాపులారిటీని సంపాదించుకున్నాడు.

ఆ సీరియల్లో ఇద్దరు భార్యల మధ్య నలిగిపోయే భర్త (Arjun Ambati) పాత్రలో అతను బాగా నటించి ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. అలాగే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ రూపొందించిన ఒకటి, రెండు, వెబ్ సిరీస్లలో కూడా నటించాడు. ఇక ఈ మధ్యనే ‘బిగ్ బాస్ 7’ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు, ఇదిలా ఉండగా.. అర్జున్ అంబటి ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.ఆమె పేరు సురేఖ. వీరిద్దరూ ‘ఇస్మార్ట్ జోడీ’ లో కూడా పాల్గొని తమ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు.

ఇక అసలు విషయానికి వెళితే… సురేఖ ఇప్పుడు నిండు గర్భిణీ అని తెలుస్తుంది. దీంతో సీమంతం వేడుకని తన భర్త అర్జున్ అంబటి ఎదురుగా జరుపుకోవాలని ఈమె భావిస్తోందట. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ‘బిగ్ బాస్’ వారిని సంప్రదించగా.. హౌస్ లో ఈమెకి సీమంతం చేసుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చారట. ఈ మూమెంట్ వల్ల ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యి, టి.ఆర్.పి రేటింగ్ ఎక్కువగా వస్తుంది అని వారు భావిస్తున్నట్లు సమాచారం.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus