అర్జున్, జగపతి బాబు కాదు..’హనుమాన్ జంక్షన్’ కోసం ముందుగా ఆ స్టార్ హీరోలని అనుకున్నారట..!

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘గాడ్ ఫాదర్’ వంటి మాస్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శకుడు మోహన్ రాజా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని 20 ఏళ్ళ క్రితం తాను తెలుగులో తెరకెక్కించిన సూపర్ హిట్ మూవీ ‘హనుమాన్ జంక్షన్’ గురించి కొన్ని ఆసక్తికరమైన సంగతుల్ని చెప్పుకొచ్చాడు. ఇతను సీనియర్ నిర్మాత ఎడిటర్ మోహన్ గారి అబ్బాయి అన్న సంగతి తెలిసిందే. ఇతని డెబ్యూ మూవీకి ‘నువ్వే కావాలి’ చిత్రాన్ని రీమేక్ చేసే అవకాశం వస్తే దాన్ని కాదని…మలయాళం సూపర్ హిట్ మూవీ ‘థెన్ కాశి పట్టణం’ ని ఎంచుకున్నాడు.

అదే ‘హనుమాన్ జంక్షన్’. ఈ సినిమాలో హీరోలుగా అర్జున్, జగపతి బాబు,వేణు నటించారన్న సంగతి తెలిసిందే. అయితే అర్జున్, జగపతి బాబు పాత్రల్లో మొదట అనుకున్న హీరోలు వేరట. ముందుగా ఈ రీమేక్ కోసం దర్శకుడు మోహన్ రాజా… మోహన్ బాబు, రాజశేఖర్ లను అనుకున్నాడట. జగపతి బాబు ప్లేస్ లో మోహన్ బాబుని, అర్జున్ ప్లేస్ లో రాజశేఖర్ ను అనుకున్నారట. వీళ్ళని ఫిక్స్ చేయడం… అడ్వాన్స్ లు ఇవ్వడం కూడా జరిగిపోయిందట.

కానీ ఇతను కొత్త దర్శకుడు కాబట్టి… మోహన్ బాబు, రాజ శేఖర్ ల వర్కింగ్ స్టైల్ ను మేనేజ్ చేయగలనా లేదా అనే సందిగ్ధంలో పడిపోయాడట. ఆ టైములో ఎడిటర్ మోహన్ గారు.. రాజా ఈ కథ పై ఫోకస్ పెడుతున్నాడా..? లేక వాళ్ళ వర్కింగ్ స్టైల్ గురించే ఆలోచిస్తాడా? అని భయపడి వాళ్ళ స్థానంలో అర్జున్, జగపతి బాబులని తీసుకోవడం జరిగిందట. అసలే మోహన్ బాబు, రాజ శేఖర్ లు చాలా డెడికేషన్ తో పనిచేస్తూ ఉంటారు.

షూటింగ్ కి టైం అంటే టైంకి వచ్చేస్తారు. వాళ్ళు ముందుగా వచ్చి కూర్చొని మిగిలిన ఆర్టిస్ట్ లు టైంకి రాకపోతే కొత్త దర్శకుడి పై ఒత్తిడి పడుతుంది. అలాంటి పరిస్థితుల్ని ఓవర్ టేక్ చేయడం కోసమే ఎడిటర్ మోహన్ గారు ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!


ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus