Arjun Kalyan,Srisatya: అర్జున్ కళ్యాణ్ వరెస్ట్ పెర్ఫామర్..! కనికరం లేని శ్రీసత్య..! జరిగింది ఇదే.!

బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ లో గెలిచి కీర్తిభట్ కెప్టెన్ అయ్యింది. ఈ సీజన్ లో ఫస్ట్ లేడీ కెప్టెన్ గా కీర్తి టాస్క్ లో విజయం సాధించింది. ఫస్ట్ వీక్ బాలాదిత్య, సెకండ్ వీక్ రాజ్, థర్డ్ వీక్ ఆదిరెడ్డి కెప్టెన్ లు అయిన సంగతి తెలిసిందే. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఈ కెప్టెన్సీ టాస్క్ కోసం సెకండ్ లెవల్లో ముగ్గురు పోరాడారు. ఇందులో సుదీప, శ్రీసత్య, ఇంకా కీర్తి పోటీ పడ్డారు. లాస్ట్ వరకూ బ్లాక్స్ ని గార్డెన్ ఏరియాలో మారుస్తూ వాటిపైనే నడుస్తూ బ్లాక్ బస్టర్ కెప్టెన్సీ రేస్ లో కీర్తిభట్ విజయం సాధించింది.

ప్రస్తుతం నామినేషన్స్ లో ఉన్నా సేఫ్ జోనే లోనే కీర్తి ఉంది. కాబట్టి వచ్చేవారం కూడా కీర్తి బిగ్ బాస్ హౌస్ లో ఉంటుంది. ఇక ఈ కెప్టెన్సీ టాస్క్ తర్వాత హౌస్ లో వరెస్ట్ పెర్ఫామర్ ని డిసైడ్ చేయమని చెప్పాడు బిగ్ బాస్. దీనికోసం గార్డెన్ ఏరియాలో సపరేట్ గా హౌస్ మేట్స్ ఒక్కొక్కరికి ఓటింగ్ పెట్టాడు. ఇందులో భాగంగా అర్జున్ కళ్యాణ్ కి, ఇంకా చంటికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఫైమా, సుదీప, చంటి, ఆరోహి, కీర్తి, ఆర్జే సూర్య, మెరీనా రోహిత్, అర్జున్ కళ్యాణ్ కి ఓట్ వేశారు.

ఇక శ్రీసత్య మాత్రం ఫైమాకి ఓటు వేసింది. ఫైమా మేనేజర్ గా అవతలి వాళ్లకి స్కోప్ ఇచ్చిందని చెప్పింది. అర్జున్ కళ్యాణ్ కి ఎక్కువ ఓట్లు రావడం వల్ల జైల్ కి వెళ్లాడు. జైల్లో ఉన్న అర్జున్ కళ్యాణ్ దగ్గరకి వచ్చి శ్రీసత్య చివాట్లు పెట్టింది. నీ గేమ్ నువ్వు ఆడు, నా మీద కూడా జాలిచూపించద్దు అంటూ మాట్లాడింది. అంతేకాదు, ఇప్పుడు నన్ను చూస్తావెందుకు, నువ్వు గెలవవా, బిగ్ బాస్ హౌస్ కి నాకోసం వచ్చావా అంటూ స్ట్రయిట్ గా అడిగింది. దీనికి అర్జున్ నవ్వేసరికి ఇంకా శ్రీసత్యకి కోపం వచ్చింది.

కనికరమే లేకుండా మాట్లాడింది. సీరియస్ గా అడుగుతున్నా చెప్పు నువ్వు దేనికోసం బిగ్ బాస్ హౌస్ కి వచ్చావ్ చెప్పు అంటూ నిలదీసింది. దీనికి నాకోసమే వచ్చాను అంటూ సమాధానం చెప్పాడు అర్జున్. మరి నీకోసం గేమ్ ఆడాలి కదా.., అమ్మాయిలని సేవ్ చేసుకుంటూ వెళ్తుంటే నువ్వేమన్నా బాబావా అంటూ , షీటీమ్ లో పనిచేస్తున్నావా అంటూ సీరియస్ గా మాట్లాడింది. అంతేకాదు, అమ్మాయిల్లో నేనున్నా కూడా ఫైట్ చేయి అంటూ చెప్పింది. ఇదే విషయాన్ని తర్వాత బాలాదిత్యతో పంచుకున్నాడు అర్జున్. బేసిగ్గా నేను అమ్మాయిలకి టాస్క్ లో డబ్బులు ఇవ్వలేదని, అందుకే, ఆరోహికి ఓటు వేయగానే కోపం వచ్చిందని చెప్పాడు.

అంతేకాదు, తర్వాత బిగ్ బాస్ కెమెరా వైపు తిరిగి నాకు ఒక్కఛాన్స్ ఇవ్వండి అంటూ బ్రతిమిలాడాడు. ఆడియన్స్ ని ఉద్దేశ్యించి నన్ను సేవ్ చేసి ఒక్కఛాన్స్ ఇవ్వండి. నేను నెక్ట్స్ వీక్ గేమ్ ఏంటో చూపిస్తాను అంటూ శపథం చేశాడు. నా ఆట ఏంటో చూపిస్తా , నేను చాలా జెన్యూన్‌గా గేమ్ ఆడాను లాస్ట్ వీక్ కూడా అరే పాపం అమ్మాయిల్ని జైలుకు పంపడం ఎందుకు అని నేను జైలుకి వెళ్లాను.ఇప్పుడు వాళ్లే నన్ను జైలుకి పంపారు అంటూ అభిప్రాయపడ్డాడు. మరి ఈవారం సేఫ్ అయితే అర్జున్ తర్వాత వారం గేమ్ ఎలా ఆడతాడు అనేది ఆసక్తికరంగా మారింది. అదీ మేటర్.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus