ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తాజాగా సినీ నటుడు అర్జున్ సర్జా ఆయన కుమార్తె ఐశ్వర్య సర్జా కలిశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసినటువంటి వీరిద్దరూ ఆలయ ప్రారంభోత్సవానికి రావాలని కోరారు అసలు వీరిద్దరూ ప్రధానమంత్రిని ఏ ఆలయ ప్రారంభోత్సవానికి రావాలి అని కోరారు అనే విషయానికి వస్తే.. ఇటీవల ప్రధానమంత్రి తమిళనాడులో ఖేలో ఇండియా గేమ్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అర్జున్ ఆయన కుమార్తె ఐశ్వర్య కూడా హాజరయ్యారు.
ఈ క్రమంలోనే నటుడు అర్జున్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు జ్ఞాపిక అందజేశారు. అనంతరం తాను తమిళనాడులోని ఎయిర్ పోర్ట్ సమీపంలో నిర్మించినటువంటి హనుమాన్ ఆలయ ప్రారంభోత్సవానికి రావాలి అంటూ ప్రధానమంత్రిని కోరడంతో ప్రధానమంత్రి కూడా వస్తానని మాట ఇచ్చినట్టు తెలుస్తోంది. హీరో అర్జున్ ఆంజనేయ స్వామి భక్తుడు అన్న సంగతి మనకు తెలిసిందే.
ఈయన శ్రీ ఆంజనేయం సినిమాలో నటించినప్పటి నుంచి ఆంజనేయ స్వామి పై భక్తి పెరిగిందని ఆ సమయంలో ఈయన గుడి కట్టించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఇలా ఆ కోరిక ప్రకారమే చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకి సమీపంలో హనుమాన్ ఆలయాన్ని నిర్మించారు. 140 టన్నుల భారీ హనుమాన్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసారు. అర్జున్ సొంత ఖర్చులతో ఈ ఆలయాన్ని నిర్మించారని తెలుస్తోంది.
దీంతో ఈ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మోడీ చేతుల మీదుగా చేయించాలని (Arjun Sarja) అర్జున్ భావించి ఆయనని మర్యాదపూర్వకంగా కలిసి ఆలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారని తెలుస్తోంది. ఈ ఫోటోలో అర్జున్ కుమార్తె ఐశ్వర్య కూడా ఉన్నారు.
‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!
‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!