చాలా కాలం తర్వాత కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) ఒక మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అదే ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ (Arjun Son Of Vyjayanthi) . ఏప్రిల్ 18న ఈ సినిమా రిలీజ్ కానుంది. ప్రదీప్ చిలుకూరి (Pradeep Chilukuri) దర్శకత్వం వహించిన ఈ సినిమాని ‘అశోకా క్రియేషన్స్’ ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్లపై కళ్యాణ్ రామ్ తో కలిసి అశోక్ వర్ధన్ ముప్ప, సునీల్ బలుసు కలిసి నిర్మిస్తున్నారు. ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోకనాథ్ (B. Ajaneesh Loknath) ఈ సినిమాకి సంగీత దర్శకుడు. సాయి మంజ్రేకర్ (Saiee Manjrekar) ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.
విజయశాంతి (Vijaya Shanthi) ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కి తల్లిగా అతి కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. శ్రీకాంత్ (Srikanth) కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా కాలంగా ఒక సరైన మాస్ సినిమా లేక అల్లాడుతున్న తెలుగు ప్రేక్షకులకి ఈ సినిమా మంచి ఫీస్ట్ ఇస్తుంది అనే ఆశలు అవి కలిగించాయి. ఆల్రెడీ ఈ సినిమాని కొంతమంది టాలీవుడ్ పెద్దలకి వేయడం జరిగింది.
సినిమా చూసిన తర్వాత వారు తమ అభిప్రాయాన్ని ఈ విధంగా షేర్ చేసుకున్నారు. ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ సినిమా రన్ టైం 2 గంటల 24 నిమిషాల నిడివి కలిగి ఉందట. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో సినిమా మొదలవుతుందట. వైజయంతి అనే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్… తన కొడుకు అర్జున్ ని గొప్ప పోలీస్ ఆఫీసర్ గా చేసి రిటైర్ కావాలనుకుంటుంది. కానీ అతన్ని పరిస్థితులు డాన్ అయ్యేలా చేస్తాయి.
ఎంత డాన్ అయినా చట్టం దృష్టిలో అతను క్రిమినలే అని భావించిన వైజయంతి… కొడుకుని అదుపులోకి తీసుకుని చట్టానికి అప్పగించాలని చూస్తుంది. ఆ తర్వాత ఏమైంది? అసలు అర్జున్ ఎందుకు క్రిమినల్ అవ్వాల్సి వచ్చింది అనేది మిగిలిన కథ అని సినిమా చూసిన వాళ్ళు చెబుతున్నారు.మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అంశాలు ఇందులో ఉన్నాయట. క్లైమాక్స్ సినిమాకి సోల్ అని అంటున్నారు.