పాన్ ఇండియా సినిమా అనే మాట టాలీవుడ్‌లో ఆ మాటకొస్తే మొత్తంగా దేశంలో వినిపించింది అంటే దానికి కారణం ‘బాహుబలి’ సినిమా. ‘బాహుబలి 1’ సినిమాతో ఈ మాటను పరిచయం చేసి, ‘బాహుబలి 2’తో ప్రపంచవ్యాప్తం చేశారు. అయితే ఇదంతా జరగడానికి ప్రధాన కారణాల్లో ఒకటి ఆర్కా మీడియా. రాజమౌళి ఆలోచనలు అనే మొక్కలకు వాళ్లు బడ్జెట్ అనే నేలను అందించిన వాళ్లు వాళ్లే. ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డకు చెందిన ఆర్కా మీడియా కొత్త సినిమాను దాదాపు ఓకే చేసుకుంది అంటున్నారు.
ప్రభాస్‌కు పాన్ ఇండియా హీరో అనే పేరు, రాజమౌళికి పాన్ ఇండియా డైరక్టర్ అనే పేరు వచ్చింది అంటే.. ఆర్కా మీడియా కష్టం ఎంతో ఉంది అని చెప్పాలి. సినిమా తీయడంలోనే కాదు, ప్రచారంలోనూ టీమ్ భారీగా ఖర్చుపెట్టింది అని చెప్పాలి. ఇప్పుడు పాన్ ఇండియా ప్రచారాలకు చాలా సినిమాలు ‘బాహుబలి’ స్టైల్‌నే వాడుతున్నాయి అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఆ నిర్మాతలు మాత్రం తర్వాత మళ్లీ మరో సినిమా అనౌన్స్ చేయలేదు. అంతేసి డబ్బులు వచ్చాయి అని అన్నారు… ఇంకా కొత్త సినిమా చెప్పరేంటి అనే ప్రశ్న చాలా రోజులుగా వినిపిస్తూ వస్తోంది.
అయితే దానికి సమాధానం ప్రభాస్ అని అంటున్నారు. అవును, ప్రభాస్‌తోనే తర్వాతి సినిమా చేయాలని ఆర్కా మీడియా ఇన్నాళ్లూ ఆగారట. ఇప్పుడు ప్రభాస్‌కు ఓ కథ చెప్పి ఓకే చేయించుకున్నారట. ‘బాహుబలి’ సినిమాలు విడుదలైన తర్వాత నుండి ప్రభాస్, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని చాలా కథలు విన్నారట. వాటిలో నుండి ఓ కథను ఫైనల్ చేశారట. ఇప్పటివరకు వెండితెరపై కనిపించని ప్రభాస్‌ను ఆ సినిమాలో చూస్తాం అని అంటున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన ఉండొచ్చు అంటున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ చేతలో వరుస సినిమాలు ఉన్నాయి. ‘ఆదిపురుష్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా… ‘సలార్’ సినిమా చిత్రీకఱన చివరి దశకొచ్చింది. మారుతి సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆ తర్వాత సిద్ధార్థ్ ఆనంద్, సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ సినిమాలు లైనులో ఉన్నాయి. వాటి తర్వాతే ఈ సినిమా ఉండొచ్చని సమాచారం.
విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?