సంచలన ట్వీట్ చేసిన బాలీవుడ్ వివాదాస్పద నటి

ప్రభాస్.. ఈ ఒక్క పేరు చాలు నేషనల్ మీడియా మొత్తం అలర్ట్ కావడానికి.. ఇదే విషయాన్ని మైండ్ లో పెట్టుకొని బాలీవుడ్ వివాదాస్పద నటి అర్షి ఖాన్ సంచలన ప్రకటన చేసింది. తాను ప్రభాస్ తో కలిసి నటిస్తున్నట్లు ట్వీట్ చేసి వార్తల్లో వ్యక్తి అయింది. భోపాల్‌కు చెందిన మోడల్ అర్షి ఖాన్ ద లాస్ట్ ఎమ్పీరర్ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది. తమిళంలోనూ ఓ సినిమా చేసింది. ఈమె సినిమాలో కంటే రియాలిటీ షోల ద్వారా బాగా పాపులర్ అయింది. బిగ్ బాస్ సీజన్ 11 షో లో 83 రోజుల పాటు ఉండి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదితో ప్రేమాయణం సాగించి విమర్శలను ఎదుర్కొంది. ఇప్పుడు ప్రభాస్ పేరుతో బ్రేకింగ్ న్యూస్ లో నిలిచింది. “మెగాస్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నిర్మించనున్న సినిమాలో నటించడానికి ఒప్పుకున్నా.

సల్మాన్ ఖాన్, కలర్స్ టీవీ, ఎండీమోల్ షైన్ ఇండియా, బిగ్‌బాస్, రాజ్ నాయక్, అభిషేక్ కు కృతజ్ఞతలు. నివేదా పుత్మన్‌కు స్పెషల్ థాంక్స్” అని అర్షి ఖాన్ ట్వీట్ చేసింది. అంతకు మించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అలాగే ఈ అకౌంట్ అర్షి ఖాన్ దేనా అనే సంగతిపై సాంకేతిక నిపుణులు నిర్ధారణ చేయలేకపోతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ సుజీత్ దర్శకత్వంలో “సాహో” సినిమా చేస్తున్నారు. దీని తర్వాత బాలీవుడ్ సినిమా చేయనున్నారు. అయితే అర్షి ఖాన్ సాహో బృందంలో జాయిన్ అయిందా? లేక బాలీవుడ్ ఎంట్రీ సినిమాలో రోల్ పట్టేసిందా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. సాహో చిత్ర బృందం ఈ ట్వీట్ పై ఏమని స్పందిస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus