Hema: ఆ కేసులోకి నన్ను అనవసరంగా లాగుతున్నారు : హేమ

బెంగుళూరు శివారు ప్రాంతంలో ఓ బిజినెస్ మెన్ కి చెందిన ఫామ్‌ హౌస్‌లో రేవ్ పార్టీ జరుగుతుంది అంటూ పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు తమ బృందంతో రైడ్ చేయగా వందమంది వరకు పట్టుబడ్డారని వార్తలు వస్తున్నాయి. పట్టుబడ్డ వారి లిస్ట్ లో టాలీవుడ్ కి చెందిన నటీనటులు, మోడల్స్ .. అలాగే పలువురు సినీ ప్రముఖులు ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ లిస్ట్ లో నటి హేమ (Hema) కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది.

టాలీవుడ్ సీనియర్ నటి హేమ ఏదో ఒకటి మాట్లాడి వివాదాల్లో నిలుస్తుంటారు. అందువల్ల ఈ లిస్ట్ లో ఆమె కూడా కచ్చితంగా ఉండే ఉంటుంది అని అంతా అభిప్రాయపడుతున్నారు. దీంతో హేమ అదంతా అవాస్తవం అని ఓ వీడియో ద్వారా క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. అవును తాజాగా ఈ ఇష్యు గురించి హేమ ఓ వీడియో పోస్ట్ చేసి.. దీని ద్వారా క్లారిటీ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ..” బెంగళూరు రేవ్ పార్టీలో నేను పట్టుబడ్డాను అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు.

నేను హైదరాబాద్లోని నా ఫామ్ హౌస్లో ఉన్నాను. మరి అక్కడ పార్టీలో పట్టుబడింది ఎవరో నాకు తెలీదు. ఆ పార్టీతో నాకు సంబంధం కూడా లేదు. నన్ను అనవసరంగా ఈ ఇష్యులోకి లాగుతున్నారు. దయచేసి అలాంటి ఫేక్ న్యూస్ లు నమ్మకండి” అంటూ ఆ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చింది హేమ.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags